V POWER NEWS, నందికొట్కూరు : శ్రీకాకుళ సాయిద రైతాంగ పోరాటయోధుడు అజ్ఞాత సూర్యుడు సిపిఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ సీనియర్ నేత కామ్రేడ్ పైల వాసుదేవరావు గారి 15వ వర్ధంతి సభ స్థానిక సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ వర్ధంతి సభకు ఐ ఎఫ్ టి యు రాష్ట్ర సహాయ కార్యదర్శి కే అరుణ్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వై నరసింహులు మాట్లాడుతూ నాటి శ్రీకాకుళ గిరిజన సాయిధ రైతాంగ పోరాటంలో పనిచేసి భూమికోసం. భుక్తి కోసం .ఈ దేశ విముక్తి కోసం సాయుధ పోరాటమే ఏకైక మార్గమని నమ్మి తన తుది శ్వాస విడిచే వరకు కామ్రేడ్ పైలా వాసుదేవరావు పనిచేశారన్నారు .బడా బూర్జువ బడా భూస్వామ్య నిరంకుశ పాలక వర్గాలను మెడలు వంచి ఈ దేశంలో ఎర్రజెండాను ఎగరవేయాలని పట్టుదలతో ప్రతిఘటన పోరాటాలను నిర్మించేందుకు ఆయన అహర్నిశలు కృషి చేశారన్నారు .శ్రీకాకుళ పోరాట వారసత్వంతో దోపిడీ పీడనలు లేని సమ సమాజ స్థాపన కై ప్రతి ఒక్కరు పోరాడాలన్నారు. నేడు దేశంలో పాలకవర్గాలు అనుసరిస్తున్న భూస్వామ్య బడా కార్పొరేట్ సామ్రాజ్యవాద అనుకూల విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున పోరాడుతున్నారు బిజెపి ఆర్ఎస్ఎస్ కూటమి ఈ పోరాటాలను ఒక ప్రక్క నెత్తురు టేర్ల లో ముంచుతూ మరోపక్క ప్రజలను మతం .కులం తెగలు పేరుతో విభజించి తమ కార్పొరేట్ కాషాయఎజెండాను అమలు చేయడానికి బ్రాహ్మణీయ హిందుత్వను ప్రజలపై ప్రయోగిస్తున్నది .కుహనా దేశభక్తి జాతీయ తల పేరు చెప్పి లౌకికవాదంపై దాడి చేస్తుంది అన్నారు. రాష్ట్రంలో టిడిపి జనసేన బిజెపి కూటమి సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను వంచించి అధికారంలోకి వచ్చింది ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పి నాలిక మడత పె బెడుతున్నది .మోడీ అమిత్ షా కూటమిలో భాగంగా ప్రజా ఉద్యమాలపై ఉక్కు పాదం మోపడానికి పూనుకుంటుంది .కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడా భూస్వాములకు ఆదాని .అంబానీ లాంటి బడా కార్పొరేట్ శక్తులకు సామ్రాజవాదుల యొక్క బహుళ జాతి సంస్థలకు సేవ చేయడమే తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు అందువలన అన్ని వర్గాల ప్రజలని సమరశీల పోరాటాలకు సమహిత్యం చేసినప్పుడే పైల గారికి నిజమైన నివాళులర్పించిన వారమవుతామన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలభారతా రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఎం గోపాల్ . ఐ ఎఫ్ టి యు డివిజన్ అధ్యక్షులు పి తిక్కయ్య .మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కే గోవిందు .తిమ్మన్న .ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు దేవన్న. భాస్కర్ .రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు..