ఇంటింటికి రేషన్ పంపిణీ రద్దు…
హలహర్వి V పవర్ న్యూస్ మే24: జూన్ 01 తేదీన నుండి రేషన్ కార్డు లబ్దిదారులకు డీలర్లు చౌక దుకాణాల్లోని నిత్యం అవసరం సరుకులు బియ్యం,చెక్కెర, కందిపపులు పంపిణీ చేయాలని డిప్యూటీ తహశీల్దార్ జీ లక్ష్మీ పేర్కొన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం హాలహర్వి మండలంలో తహశీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తాహాశీల్దార్ జి లక్ష్మి ఎండియూ, డిల్లరతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఇంటింటి రేషన్ బియ్యం సరఫరా ఎండీయూ వాహనం రద్దు పరచడమైనదిని తెలిపారు.జూన్ 01తేది నుండి 15 వరకు చౌక దుకాణాల్లో రేషన్ అందించాలని డీలర్లకు సూచించారు.ప్రతి నెల ఒకటవ తేదీన చౌక దుకాణాల్లో ప్రజా ప్రతినిధుల సమక్షంలో రేషన్ అందించాలని కోరారు.65 సంవత్సరం పైబడిన వారికి,వికలాంగులకు ఇంటి దగ్గర నిత్యం అవసరం సరుకులు అందించాలని తెలిపారు.రేషన్ కార్డు దారులు గుంపు గుంపులు లేకుండా క్రమ పద్ధతిలోనే పంపిణీ చేయాలని డీలర్లకు సూచించారు.ఎండియు ఆపరేటర్లు ఈ పస్ మిషన్, ఎలక్ట్రానిక్ వెయిటింగ్ మిషన్,తదితర వాటిని డీలర్ కు సమర్పించాలని అన్నారు.కార్డుదారులకు రేషన్ పంపిణీ చేసిన సమయంలో నీటి వసతి కల్పించాలని డీలర్లకు సూచించారు.చౌకు ధరలు దుకాణం డీలర్లు స్టాక్ రిజిస్టర్ ఖచ్చితమైన రికార్డులతో చూపించాలని పేర్కోన్నారు.స్టాక్ వెంటనే బోర్డు ప్రతి దినం చౌకుదారుల దుకాణం నందు తెలుపుతూ బోర్డు పైన డిజి ఆర్వో ఫోన్ నెంబర్ను డిస్ప్లే చేయాలన్నారు. నిత్యవసర సరుకులు సరిగా పంచలేని డీలర్లు పై ఏపీ స్టేట్ టిపిఓఎస్ ఆర్డర్ నందు 2018 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆర్ ఐ మహేష్ గౌడ్, వీఆర్వోలు తిప్పన ,రాఘవేంద్ర స్వామి, లింగప్ప,ఈరప్ప ,మస్తాన్, నాగరాజు , రమేష్, డీలర్లు , ఎండియూ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.