• రషీద్ ఆర్ట్స్ అధినేతకు రషీద్ కు ఘన సన్మానం.
V POWER NEWS : చాగలమర్రి , రుద్రవరం గ్రామంలో దుర్వి చెంచు లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి ఆర్ట్స్ అండ్ పెయింటింగ్ వేసినందుకు చాగలమర్రి గ్రామం నుంచి రషీద్ ఆర్ట్స్ అధినేతకు రషీద్ కు అరుదైన గౌరవ సన్మానం లభించింది.రుద్రవరం దుర్వి చెంచు లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ సభ్యులు ఆర్ట్స్ అండ్ పెయింటింగ్ వేసినందుకు రషీద్ ఆర్ట్స్ అధినేత రషీద్ మరియు వారి బృందానికి శాలువ కప్పి , పూల మాల వేసి షీల్డ్ ఇచ్చి సన్మానించడం జరిగింది.రషీద్ మాట్లాడుతూ ఇంతటి గౌరవం మాకు దక్కినందుకు మాకు చాలా సంతోషంగా ఉందని వ్యక్తం చేశారు.చాగలమర్రి ప్రజలు మాట్లాడుతూ ఇలాంటి అవార్డులు చాగలమర్రి వాసులకు మరెన్నో రావాలని మనసారా కోరుతున్నాము అని తెలిపారు.
