వైద్యం కోసండబ్బులు లేక వితంతువు మృతి. .. బతిమలాడిన కనికరించని అధికారి.– గ్రామ పెద్దలు చెప్పిన వినని వైనం. — వైద్యం కోసం డబ్బులు లేకుంటే వడ్డీకి తీసుకోమని చెప్పిన అధికారి. — కన్నీరు కార్చిన కుమారుడు. –మందులకు డబ్బులు లేక అనారోగ్యంతో మృతి చెందిన వితంతు మహిళ. — తన కన్నతల్లి మృతి పై అధికారుల నిర్లక్ష్యాన్ని చెబుతున్న కొడుకు.

V POWER NEWS : రుద్రవరం మండలంలో..కాయ కష్టం చేసుకుంటూ బ్రతుకుతున్న నిరుపేద వృద్ధులకు, వితంతువులకు, వంటరి మహిళలకు , కుల వృత్తుల వారికి మీ కష్టానికి తోడుగా మేమున్నామంటూ ప్రభుత్వాలు కొంత డబ్బులు పింఛన్ రూపంలో అందిస్తుంది. ప్రభుత్వం అందించే ఈ సహాయంతో వారి జీవనానికి, వారి ఆరోగ్య స్థితి గతులకు , వ్యక్తిగత అవసరాలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని ఆశతో వారి అవసరాలను తీర్చుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇందుకు విరుద్ధంగా కొందరు అధికారులు ఇంటి పన్ను ,నీటి పన్నులు కట్టాలంటూ మీ అవసరాలతో మాకేంటి మీ బాధలతో మాకేంటి అంటూ ముక్కు పిండి ప్రభుత్వం ఇచ్చే పింఛన్ల సొమ్మును వసూలు చేయడంతో తమకు కనీస అవసరమైన మందులకు డబ్బులు లేక అనారోగ్యంతో ఓ వితంతు మహిళ మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయానికి సమీపంలో ఉన్న లక్ష్మీదేవి 45 సంవత్సరాలు ప్రభుత్వం అందించే వితంతు పింఛన్ తీసుకుంటూ తన ఒక్కగానొక్క కొడుకును పోషించుకుంటూ జీవనం సాగిస్తుంది. స్థానిక ఎగ్జిక్యూటివ్ అధికారి మార్చి మాసానికి చెందిన వితంతు పింఛన్ 4 వేల రూపాయలను లక్ష్మీదేవికి ఇవ్వలేదు. తన వితంతు పింఛను నాకు ఎందుకు ఇవ్వలేదని తన కొడుకుతో సహా వచ్చి అధికారిని అడగగా మీరు ఇంటి పన్ను కట్టలేదంటూ అందుకు బదులుగా మీ పింఛను సొమ్మును జమ చేస్తున్నామని జవాబు ఇవ్వడంతో కృంగిపోయిన ఆ మహిళ అయ్యా నాకు గత కొంతకాలంగా నేను షుగరు ఆయాసంతో నానా ఇబ్బందులు పడుతూ మందులను కొనుక్కొని వాటిని మింగుతూ బ్రతుకుతున్నాను నా మీద కనికరం ఉంచి నా పింఛను డబ్బులు ఇవ్వమని ప్రాధేయపడిన కనికరించని ఆయన మీకు మందులకు డబ్బులు లేకపోతే నేను ఏమి చేయాలి మీరు ఇంటి పన్ను కట్టలేదు కాబట్టి నేను జమ చేసుకున్నాను. మీకు మందులకు లేకపోతే డబ్బులను వడ్డీకి తీసుకొని హాస్పిటల్ కి వెళ్ళమని చెప్పడంతో ఏమి చేయాలో దిక్కుతోచక గత 15 రోజులుగా నంద్యాలకు వెళ్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించుకుంటూ ఉంది. తన పింఛను ఇప్పించమని లక్ష్మీదేవి గ్రామ పెద్దలతో చెప్పింది. గ్రామ పెద్దలు స్థానిక ఎగ్జిక్యూటివ్ అధికారికి పలుమార్లు చెప్పిన ఆయన వినలేదు. అనారోగ్యంతో బాధపడుతున్న లక్ష్మీదేవి శనివారం అర్ధరాత్రి సమయంలో మృతి చెందిందని గ్రామస్తులు తెలిపారు. తన పింఛను డబ్బులు పన్నుల పేరిట జమ చేసుకోవడంతోనే సరైన సమయానికి మందులకు డబ్బులు లేకనే లక్ష్మి దేవి మృతి చెందిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన తల్లి కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతూ కేవలం ప్రభుత్వం ఇచ్చే పింఛను డబ్బుతో మందులను కొని వాటిని మింగుతూ బ్రతుకుతుందని తన కొడుకు రామ మోహన్ తెలిపారు. మా అమ్మకు వచ్చే పింఛను డబ్బును ఎగ్జిక్యూటివ్ అధికారి సుబ్బారావు పన్ను కట్టాలంటూ ప్రభుత్వం ఇచ్చే 4000 రూపాయలను మాకు ఇవ్వకుండా జమ చేసుకున్నానని చెప్పాడు. మా అమ్మకు బాగాలేదు డబ్బు లేకపోతే మందులను నేను కొనలేను మందులు కొనకపోతే మా అమ్మ చనిపోతుంది సార్ అని గత 15 రోజులుగా బ్రతిమాలుతూనే ఉన్నాను. మీ బాధలతో మాకేంటి పని మీకు డబ్బు లేకపోతే వడ్డీకి తీసుకొని మందులను కొనుక్కొని మీ అమ్మను బ్రతికించుకుపో అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడన్నారు. ఇవాళ కేవలం మా అమ్మకు మందులు కొనలేక మా అమ్మ మృతి చెందిందని ఒక్కగా నొక్క కొడుకు కన్నీరు కార్చాడు. ఇది చూసిన ఇరుగుపొరుగు వారు కన్నీరు కార్చారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం అందించే పింఛన్ సొమ్మును పన్నుల పేరట వసూలు చేస్తూ ప్రజల చావులకు కారణమవుతున్న ఇలాంటి అధికారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.