భాదిత మహిళ లను రక్షించుట కోసం .. టెండర్స్ ఫారం కోరిన జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమము మరియు సాధికారత అధికారి
V power news , kurnool: కర్నూలు జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమము మరియు సాధికారత అధికారి, కర్నూలు (జిల్లా) గారి అద్వర్యంలో నడపబడుతున్న కర్నూల్ వన్ స్టాప్ సెంటర్ పరిధిలో జిల్లా లోని భాదిత మహిళ లను రక్షించుట కోసం అనే ప్రాతిపదికన 2025 వ సంవత్సరము నకు గాను (మారుతి ECCO కానీ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ తరహాలో ఉండే) వాహనం సమకూర్చుటకు ఆసక్తిగల సరఫరా దారుల నుండి టెండర్ లను కాని కొటేషన్ లను కాని కోరడమైనది. ఆశక్తి కల సరఫరా దారులు రూ.. 3000/- (ఆక్షరాలా మూడు వేల రూపాయిలు మాత్రమె) ధరిపిత్తు జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమము మరియు సాధికారత అధికారి గారి పేరూ పై డి.డి. తీసి కోటేషన్/ టెండర్స్ ఫారం తోపాటూ జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమము మరియు సాధికారత అధికారి కార్యాలయం నందు సంప్రదించి ప్రభుత్వ పని దినమూలందు తేది 25/08/2025 మధ్యాహనం 12 గం.ల లోపు పొందవలయును పూర్తి చేసిన కోటేషన్/ టెండర్ ఫారం ను తేది:30/8/2025 మధ్యాహనం 3 గం. ల లోపు కార్యాలయం నందు అందచేయగలరని కర్నూలుజిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమము మరియు సాధికారత అధికారి,.