V POWER NEWS

APRSA కర్నూలు రెవెన్యూ డివిజన్ ఆధ్వర్యంలో … సింహపురి సింహము కామ్రేడ్ తోట సుధాకర్ ప్రసాద్ వర్ధంతి

సింహపురి సింహము కామ్రేడ్ తోట సుధాకర్ ప్రసాద్ చిత్రపటానికి  పూల మాలలు వేసిన APRSA కర్నూలు డివిజన్ అధ్యక్షులు వి.రామాంజనేయులు & సెక్రటరీ వేణుగోపాల్ రావు, డివిజన్ తహసీల్దారులు 

CMRF చెక్కును అందజేసిన ఎంపీ బస్తిపాటి నాగరాజు

… V POWER NEWS  : కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటుందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. కర్నూలు జిల్లా ఆస్పరికి చెందిన పి.కేశవరెడ్డికి ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం కింద అందిన ఆర్ధిక సహాయాన్ని ఆయన తన కార్యాలయంలో అందజేశారు… కేశవరెడ్డి ఆరోగ్య సమస్యలతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు.. అనంతరం వైద్య ఖర్చుల సహాయం కోసం ఎంపీ నాగరాజును సంప్రదించి సీఎం రీలీఫ్ ఫండ్ కి దరఖాస్తు చేసుకోగా రూ.3,09,470 మంజూరు అయ్యాయి.. కాగా సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్ధిక సహాయం అందేందుకు సహకారం అందించిన ఎంపీ కి లబ్దిదారుడు కృతజ్ఞతలు తెలిపారు…ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఖర్చు చేస్తుందన్నారు…

ఈసీ సమావేశంలో వన్ స్టాప్ సెంటర్ సేవలపై అవగాహన సదస్సు

స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి విజయ ఆదేశాల మేరకు ఈసీ సమావేశంలో వన్ స్టాప్ సెంటర్ సేవలపై అవగాహన సదస్సు V POWER NEWS  : కర్నూలు జిల్లాలోని..స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి విజయ ఆదేశాల మేరకు జిల్లా మహిళ సమైక్య ఈసీ సమావేశంలో శక్తి మిషన్ కింద పనిచేసే వన్ స్టాప్ సెంటర్ సర్వీసెస్ ప్రీమారిటల్ కౌన్సెలింగ్, మిషన్ వాత్సవం గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది వి. విజయ కుమారి, యం.సునీత మరియు తదితరులు పాల్గొన్నారు.

కర్నూలు కలెక్టర్ సిరి చేతులమీద గా “వన్ స్టాప్ సెంటర్” సేవ పోస్టర్స్ విడుదల

V POWER NEWS  : కర్నూలు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ మరియు సాధికారత అధికార విభాగం కింద పని చేయుచున్న వన్ స్టాప్ సెంటర్ – మిషన్ శక్తి ద్వారా అందిస్తున్న సేవలు తాత్కాలిక వసతి, వైద్య, న్యాయ, పోలీస్ మరియు కౌన్సిలింగ్ సేవలు ఉంటాయి. ఎపుడు వన్ స్టాప్ సెంటర్ ను ఆశ్రయించాలి అనేటువంటి పోస్టర్స్ ను.సోమవారం నాడు కలెక్టర్ సిరి అలాగే జాయింట్ కలెక్టర్ నవ్య చేతులమీద గా విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో ప్రాజెక్ట్ డైరెక్టర్ పి. విజయ, డిఆర్ఓ, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ విజయ లక్ష్మి, వన్ స్టాప్ సెంటర్ అడ్మిన్ పి. మేరీ స్వర్ణలత, జోష్టనా పాల్గొన్నారు.

ఫోటో,వీడియో గ్రాఫర్స్ ఆధ్వర్యంలో .. ఘనంగా సింధు డిజి ప్రింట్ హౌస్ ప్రారంభం..

V POWER NEWS: కర్నూలు నగరంలో శుక్రవారం ఘనంగా మౌర్య ఇన్ దగ్గర్లో ఆర్ఆర్ హాస్పిటల్ లైన్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఎదురుగా ప్రొపెటర్ బోరెల్లి సుధాకర్ మరియు ఫోటోగ్రాఫర్స్,వీడియో గ్రాఫర్స్ ఆధ్వర్యంలో సింధు డిజి ప్రింట్ హౌస్ ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా ప్రొఫైటర్ సుధాకర్ మాట్లాడుతూ సింధు ఫోటో డిజి ప్రింట్ హౌస్ లో ఫోటో ఫ్రేమ్స్, వెడ్డింగ్ కార్డ్స్ ,ఆల్బమ్స్, బైండింగ్ ఫోటోగ్రఫీ ఈవెంట్స్, విసిటింగ్ కార్డ్స్, క్యాలెండర్స్, LED ప్రేమ్స్, వీడియోగ్రఫీ డిజైనింగ్ మరియు వీడియో మిక్సింగ్ ఫోటో  వీడియో డిజైనింగ్ కొరకు హైదరాబాదు మరియు  విజయవాడ వెళ్లవలసిన అవసరం లేకుండా ఇక్కడ అన్ని రకములైన విధంగా నాణ్యమైన క్వాలిటితో తయారు చేయబడు తుందని ఆయన తెలిపారు. ఈ సదా అవకాశంను అందరూ ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెవ,జయకాంత్ క్రిస్టియన్.భార్గవాచారి ఫోటో వీడియో గ్రాఫర్స్ ప్రెసిడెంట్,బద్రి ప్రసాదు సీనియర్ ఫోటోగ్రాఫర్, రాంభూపాల్ రెడ్డి సీనియర్ ఫోటోగ్రాఫర్, సురేష్ బాబు సీనియర్ డిజైనర్, వడ్ల మధు కుమార్ సీనియర్ డిజైనర్, సిద్దు పవర్ సీనియర్ డిజైనర్, బైరెడ్డి ప్రతాప్ రెడ్డి సీనియర్ ఎడిటర్, కే చంద్రశేఖర్ సీనియర్ ఫోటోగ్రాఫర్, ధర్మాపేట శేఖర్, ఇబ్రహీం నవత స్టూడియో,మరియు కుటుంబ సభ్యులు,ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్, పాస్టర్స్, శ్రేయోభిలాషులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఫోటో,వీడియో గ్రాఫర్స్ ఆధ్వర్యంలో ఘనంగా సింధు డిజి ప్రింట్ హౌస్ ప్రారంభం..

V Power News : కర్నూలు నగరంలో శుక్రవారం ఘనంగా మౌర్య ఇన్ దగ్గర్లో ఆర్ఆర్ హాస్పిటల్ లైన్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఎదురుగా ప్రొపెటర్ బోరెల్లి సుధాకర్ మరియు ఫోటోగ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్ ఆధ్వర్యంలో సింధు డిజి ప్రింట్ హౌస్ ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా ప్రొఫైటర్ సుధాకర్ మాట్లాడుతూ సింధు ఫోటో డిజి ప్రింట్ హౌస్ లో ఫోటో ఫ్రేమ్స్, పాంప్లెట్స్, వెడ్డింగ్ కార్డ్స్ ,ఆల్బమ్స్,బైండింగ్ ఫోటోగ్రఫీ ఈవెంట్స్,విసిటింగ్ కార్డ్స్, క్యాలెండర్స్, ఎల్ఈడి ప్రేమ్స్, వీడియోగ్రఫీ డిజైనింగ్ మరియు వీడియో మిక్సింగ్ ఫోటో వీడియో డిజైనింగ్ కొరకు హైదరాబాదు మరియు విజయవాడ వెళ్లవలసిన అవసరం లేకుండా ఇక్కడ అన్ని రకములైన విధంగా నాణ్యమైన క్వాలిటితో తయారు చేయబడు తుందని ఆయన తెలిపారు. ఈ సదా అవకాశంను అందరూ ఉపయోగించుకోవాలని కోరారు.  ఈకార్యక్రమంలో  జయకాంత్ క్రిస్టియన్ .భార్గవాచారి ఫోటో వీడియో గ్రాఫర్స్ ప్రెసిడెంట్, బద్రిప్రసాదు సీనియర్ ఫోటోగ్రాఫర్, రాంభూపాల్ రెడ్డి సీనియర్ ఫోటోగ్రాఫర్, సురేష్ బాబు సీనియర్ డిజైనర్, వడ్ల మధు కుమార్ సీనియర్ డిజైనర్, సిద్దు పవర్ సీనియర్ డిజైనర్, బైరెడ్డి ప్రతాప్ రెడ్డి సీనియర్ ఎడిటర్, కే చంద్రశేఖర్ సీనియర్ ఫోటోగ్రాఫర్, ధర్మాపేట శేఖర్, ఇబ్రహీం నవత స్టూడియ మరియు కుటుంబ సభ్యులు, ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్, పాస్టర్స్, శ్రేయోభిలాషులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

కె.వి.ఆర్ డిగ్రీ కళాశాల లో సైన్స్ ల్యాబ్ పరిశీలించినా .. డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్ కె.వి.బాలమని.

V POWER NEWS KURNOOL TOWN. :కర్నూలు జిల్లా, మహిళ అభివృద్ధి మరియు శ్రీ శిశు సంక్షేమశాఖ డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్ కె.వి.బాలమని , కె.వి.ఆర్ డిగ్రీ కళాశాల లోని సైన్స్ ల్యాబ్ పరిశీలించారు, మిషన్ శక్తి, వన్ స్టాప్ సెంటర్ సేవలు , బేటిబచావ్ బేటిపడ్దోవ్,పీర్ గ్రూపు లీడర్స్ యొక్క భాద్యతలను గురించి తెలియజేశారు ,ఇందులో భాగంగా కె. వి. ఆర్. డిగ్రీ కళాశాల సిబ్బంది, విద్యార్థులు మరియు వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది పి. ఎఫ్.ఓ. జి. శ్రీనివాసులు, కేస్ వర్కర్ ఐ.విజయకుమారి, పారా మెడికల్ పి. రేష్మా పాల్గొన్నారు

బీసీ,ఎస్సీ,ఎస్టీ హాస్టల్ లో ..  పది రోజుల ప్రత్యేక సంకల్ప ప్రోగ్రాముపై అవగాహనా 

V POWER NEWS  : కర్నూలు జిల్లా, స్త్రి శిశు సంక్షేమ మరియు సాధికారత అధికార విభాగం కింద పని చేయుచున్న వన్ స్టాప్ సెంటర్ ద్వారా సంకల్ప ప్రోగ్రాము పది రోజుల ప్రత్యేక అవగాహనా కార్యక్రమం లో భాగంగా కలెక్టరేట్ దగ్గర ఉన్న బీసీ,ఎస్సీ,ఎస్టీ హాస్టల్ లో ఉన్న ఆడోలిసెంట్ బాలికలకు సానిటరీ నాపకిన్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.విజయ, జయమ్మ , జయమ్మ డిడి, ఐ&పిఆర్ అగ్రికల్చర్ ఆఫీసర్ వరలక్ష్మి  చేతుల మీద ఇవ్వడం జరిగింది. అలాగే పీరియడ్ వచ్చినపుడు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిశుభ్రతను పాటించాలి, పౌష్టికహారాన్ని ఎలా తీసుకోవాలి అనే విషయాలను అవగాహనా కల్పించారు.ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.విజయ ఓఎస్సీ అడ్మిన్ మేరీస్వర్ణలత, జోష్టనా ప్రియాంక, సునీత పాల్గొన్నారు.

16 లక్షల విలువ చేసే 32 ద్విచక్ర వాహనాలు స్వాధీనం .. కర్నూలు DSP బాబు ప్రసాద్

లక్ష్మీనగర్ కు చెందిన  నిరంజన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు .. ద్విచక్ర వాహనాలు దొంగలించే నిందితుడు అరెస్టు .. కర్నూలు డిఎస్పీ  జె. బాబు ప్రసాద్.  V POWER NEWS KURNOOL,  క్రైమ్  : కర్నూలు రెండవ పట్టణ పోలీసులు 16 లక్షల విలువ చేసే 32 ద్విచక్ర వాహనాలు దొంగలించిన నిందితున్ని  శుక్రవారం అరెస్టు చేశారు. ఈ సంధర్బంగా కర్నూలు డిఎస్పీ  జె. బాబు ప్రసాద్,  కర్నూలు టు టౌన్ సిఐ నాగరాజారావు, ఎస్సైలు సతీష్, మల్లికార్జున తో కలిసి  కర్నూలు  రెండవ పట్టణ పోలీసుస్టేషన్ లో నిందితుని వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. కర్నూలు పట్టణంలోని భూపాల్ కాంప్లెక్స్ దగ్గర ఒక బైక్ దొంగలించారని  కర్నూలు, లక్ష్మీనగర్ కు చెందిన  నిరంజన్  ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, కర్నూలు టు టౌన్ సిఐ , ఎస్సైలు, పోలీసు కానిస్టేబుల్స్ రవి కుమార్, శ్రీనివాసులు, మహేంద్రలు కలిసి ఒక  స్పెషల్ టీమ్ గా ఏర్పడి నిందితున్ని పట్టుకోవడాని చర్యలు చేపట్టామని, మాకు రాబడిన సమాచారం మేరకు   కర్నూలు- సుంకేశుల రోడ్డు లో ఉన్న రెండు వాగుల వద్ద శుక్రవారం నాడు , తెలంగాణ రాష్ట్రం, గద్వాల పట్టణం, దౌడురాళ్ళ కాలనీకి చెందిన తెలుగు జయంత్ @జస్వంత్  ను అరెస్టు చేసి, అతని నుండి 32 బైక్ (హోండాషైన్ , హిరో హోండా, యూనికార్న్ ) లను రికవరీ చేయడం జరిగిందని వీటి విలువ రూ. 16 లక్షల వరకు ఉంటుందన్నారు.  

డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్ కె.వి.బాలామని ఆధ్వర్యంలో.. విద్యార్థులకు యాక్ట్ పై అవగాహన

V POWER NEWS : కర్నూలు జిల్లా మహిళా అభివృద్ధి మరియు శ్రీ శిశు సంక్షేమశాఖ, డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్ కె.వి.బాలామని గ పోక్సో యాక్ట్ పై అవగాహన కల్పించారు.అదేవిదంగా వన్ స్టాప్ సెంటర్ సేవలు, యువ సకి పీర్ గ్రూప్ లీడర్స్ యొక్క భాద్యతలనుతెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ పొట్టిశ్రీరాములు స్మారక పాఠశాల బండిమిట్ట ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది పి.ఎఫ్.ఓ.శ్రీనివాసులు,కేస్ వర్కర్ విజయకుమారి, పారామెడికల్ రేష్మా పాల్గొన్నారు

error: Content is protected !!