జిల్లాలో రూ. 14 కోట్లతో 5 టూరిజం ప్రాజెక్టులను అభివృద్ధికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాo .. జిల్లా కలెక్టర్

కర్నూలు జిల్లాలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని విధాలా కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పేర్కొన్నారు శనివారం ఉదయం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యాటకదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి మాట్లాడుతూ….ఈ ఏడాది ప్రపంచ పర్యాటక దినోత్సవం ధీమ్ స్థిరమైన పర్యాటకం మరియు పరివర్తన అని తెలిపారు. పర్యావరణాన్ని కాపాడుకుంటూ టూరిజంను అభివృద్ధి చేసుకుందాం అని సూచించారు.జిల్లాలో రూ. 14కోట్లతో 5 టూరిజం ప్రాజెక్టులను అభివృద్ధికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారన్నారు. మనకు వారసత్వంగా వచ్చిన పర్యాటక కేంద్రాలను, కొత్తగా ఏర్పాటు చేసుకునే పర్యాటక కేంద్రాలను కూడా ఎల్లపుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు.. మనం ఇంకా ప్లాస్టిక్ బాటిళ్లలో ఉండే నీరు త్రాగి మన ఆరోగ్యాన్ని , పర్యావరణాన్ని పాడు చేసుకుంటున్నామని దాన్ని వెంటనే ఆపాలని, అలాగే ఇళ్లలో, కార్యాలయాల్లో ఏసీ , కరెంటు వాడకాలను తగ్గించి పర్యావరణాన్ని కాపాడేందుకు కృషి చేయాలని కోరారు. సోలార్ పవర్ , విండ్ పవర్ వంటి వాటిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి కర్బన ఉద్గారాలు లేకుండా పర్యావరణాన్ని కాపాడుతూ, పవర్ అందించే చర్యలు తీసుకుంటోందన్నారు.జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి గణనీయంగా పెరుగుతోందని, తద్వారా పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ తెలిపారు.


