తాజా వార్తలు

సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం ..

అంబేద్కర్ విగ్రహం దగ్గర కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలకు అభినందనలు , శుభాకాంక్షలు తెలిపినా తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ బేవినహాల్ సుధాకర్, క్లస్టర్ ఇంచార్జ్ ప్రహ్లాద రెడ్డి.

ఆదోని పట్టణంలో .. యోగాంధ్ర 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ర్యాలీ

ప్రజలకు అవగాహన కల్పిస్తున్న మున్సిపాలిటీ అధికారులు.. V POWER NEWS   : కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని స్థానిక మున్సిపల్ ఆఫీసు ప్రాంగణం నుండి పాత బ్రిడ్జి వరaకు ర్యాలీగా వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తూ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఒకే భూమి, ఒకే ఆరోగ్యం కోసం యోగాంధ్ర 2025 సందర్భంగా మున్సిపల్ చైర్మన్ సిహెచ్ లోకేశ్వరి, మున్సిపల్ కమిషనర్ ఎం. కృష్ణ, మున్సిపల్ ఇంజనీర్ ఇంతియాజ్ అలీ, ఆదేశానుసారంగా మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ అనుపమ, మున్సిపల్ డిఈ రామ్మూర్తి, డిఈ గోపీనాథ్, డిఈ వెంకట చలపతి, ఏఈ జనార్ధన్ ఆధ్వర్యంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఒకే భూమి, ఒకే ఆరోగ్యం కోసం యోగాంధ్ర 2025 పై ప్రజల భాగస్వామ్యం అవ్వాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి హమ్యూనిటీ సచివాలయం సెక్రెటరీ పావని, సచివాలయ సిబ్బంది, హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది, మునిసిపల్ రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ఆగ్రలో నిర్వహించిన రాణి అహల్యా బాయి 300వ .. జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎం.పి బస్తిపాటి నాగరాజు

 V POWER NEWS :  ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్ర లో కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ సహాయ మంత్రి ఎస్.పి సింగ్ బఘేల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రాణి అహల్యా బాయి హోల్కర్ 300 వ జయంతి వేడుకల్లో కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు..ఈ సందర్బంగా ఉప రాష్ట్రపతి జగదీష్ దంకర్ , యూ.పి సీ.ఎం యోగి ఆదిత్య నాథ్ , హరియాణ గవర్నర్ బండారు దత్తత్రేయ ల తో కలిసి రాణి అహల్యా బాయి చిత్ర పట్టానికి ఆయన పూల మాలలు వేసి నివాళులర్పించారు…అనంతరం ఎం.పి నాగరాజు మాట్లాడుతూ రాణి అహల్య బాయి మహిళా అభ్యుదయవాదిగా దేశం కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారన్నారు..సామాజిక సంక్షేమం, మరియు మానవతా పనులతోపాటు మత పరమైన , విద్య మరియు సాంస్కృతిక పురోగతికి కృషి చేసారన్నారు…ఎన్నో దేవాలయాలతో పాటు ధర్మశాలలను ఆమె నిర్మించారన్నారు..రాణి అహల్యా బాయి జీవితం అందరికి స్ఫూర్తిదయాకమన్నారు…ఈ కార్యక్రమంలో పలు రాష్ట్రాలకి చెందిన ఎంపీ లు , నాయకులు పాల్గొన్నారు…

చాగలమర్రి వాసులకు … ఆర్ట్స్ అండ్ పెయింటింగ్ వేసినందుకు రుద్రవరంలో అరుదైన గౌరవం

• రషీద్ ఆర్ట్స్ అధినేతకు రషీద్ కు ఘన సన్మానం. V POWER NEWS :   చాగలమర్రి , రుద్రవరం గ్రామంలో దుర్వి చెంచు లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి ఆర్ట్స్ అండ్ పెయింటింగ్ వేసినందుకు చాగలమర్రి గ్రామం నుంచి రషీద్ ఆర్ట్స్ అధినేతకు రషీద్ కు అరుదైన గౌరవ సన్మానం లభించింది.రుద్రవరం దుర్వి చెంచు లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ సభ్యులు ఆర్ట్స్ అండ్ పెయింటింగ్ వేసినందుకు రషీద్ ఆర్ట్స్ అధినేత రషీద్ మరియు వారి బృందానికి శాలువ కప్పి , పూల మాల వేసి షీల్డ్ ఇచ్చి సన్మానించడం జరిగింది.రషీద్ మాట్లాడుతూ ఇంతటి గౌరవం మాకు దక్కినందుకు మాకు చాలా సంతోషంగా ఉందని వ్యక్తం చేశారు.చాగలమర్రి ప్రజలు మాట్లాడుతూ ఇలాంటి అవార్డులు చాగలమర్రి వాసులకు మరెన్నో రావాలని మనసారా కోరుతున్నాము అని తెలిపారు.

చౌక దుకాణాల్లోని రేషన్ సరుకులు పంపిణీ ..

ఇంటింటికి రేషన్ పంపిణీ రద్దు… హలహర్వి V పవర్ న్యూస్ మే24: జూన్ 01 తేదీన నుండి రేషన్ కార్డు లబ్దిదారులకు డీలర్లు చౌక దుకాణాల్లోని నిత్యం అవసరం సరుకులు బియ్యం,చెక్కెర, కందిపపులు పంపిణీ చేయాలని డిప్యూటీ తహశీల్దార్ జీ లక్ష్మీ పేర్కొన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం హాలహర్వి మండలంలో తహశీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తాహాశీల్దార్ జి లక్ష్మి ఎండియూ, డిల్లరతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఇంటింటి రేషన్ బియ్యం సరఫరా ఎండీయూ వాహనం రద్దు పరచడమైనదిని తెలిపారు.జూన్ 01తేది నుండి 15 వరకు చౌక దుకాణాల్లో రేషన్ అందించాలని డీలర్లకు సూచించారు.ప్రతి నెల ఒకటవ తేదీన చౌక దుకాణాల్లో ప్రజా ప్రతినిధుల సమక్షంలో రేషన్ అందించాలని కోరారు.65 సంవత్సరం పైబడిన వారికి,వికలాంగులకు ఇంటి దగ్గర నిత్యం అవసరం సరుకులు అందించాలని తెలిపారు.రేషన్ కార్డు దారులు గుంపు గుంపులు లేకుండా క్రమ పద్ధతిలోనే పంపిణీ చేయాలని డీలర్లకు సూచించారు.ఎండియు ఆపరేటర్లు ఈ పస్ మిషన్, ఎలక్ట్రానిక్ వెయిటింగ్ మిషన్,తదితర వాటిని డీలర్ కు సమర్పించాలని అన్నారు.కార్డుదారులకు రేషన్ పంపిణీ చేసిన సమయంలో నీటి వసతి కల్పించాలని డీలర్లకు సూచించారు.చౌకు ధరలు దుకాణం డీలర్లు స్టాక్ రిజిస్టర్ ఖచ్చితమైన రికార్డులతో చూపించాలని పేర్కోన్నారు.స్టాక్ వెంటనే బోర్డు ప్రతి దినం చౌకుదారుల దుకాణం నందు తెలుపుతూ బోర్డు పైన డిజి ఆర్వో ఫోన్ నెంబర్ను డిస్ప్లే చేయాలన్నారు. నిత్యవసర సరుకులు సరిగా పంచలేని డీలర్లు పై ఏపీ స్టేట్ టిపిఓఎస్ ఆర్డర్ నందు 2018 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆర్ ఐ మహేష్ గౌడ్, వీఆర్వోలు తిప్పన ,రాఘవేంద్ర స్వామి, లింగప్ప,ఈరప్ప ,మస్తాన్, నాగరాజు , రమేష్, డీలర్లు , ఎండియూ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా ఎస్పీ ఆదేశాలతో “హనుమాన్ జయంతి” వేడుకలకు గట్టి పోలీసు బందోబస్తు

ట్రాఫిక్ క్రమబద్ధీకరణ , నేరాల నియంత్రణలపై ప్రత్యేక దృష్టి పెట్టినా పోలీసులు గురువారం శ్రీ హనుమాన్ జయంతి నేపథ్యంలో కర్నూలు జిల్లా ఎస్పీ  విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారి ఆదేశాలతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. హనుమాన్ జయంతి వేడుకలు, శోభయాత్ర లు నిర్వహించే ప్రదేశాలలో ప్రశాంత వాతావరణం ఉండే విధంగా చర్యలు చేపట్టారు.

error: Content is protected !!