V POWER NEWS

గ్రౌండ్‌ ట్రూథింగ్‌ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించండి …. జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్

V POWER NEWS .. :    నంద్యాల జిల్లా వ్యాప్తంగా రైతుల పొలాల్లో జరుగుతున్న గ్రౌండ్‌ ట్రూథింగ్‌ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్ రెవెన్యూ, సర్వే శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం బనగానపల్లె మండలం, నందివర్గం గ్రామంలో జరుగుతున్న రీ సర్వే పనుల గ్రౌండ్‌ ట్రూథింగ్‌ ప్రక్రియను జాయింట్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్ మాట్లాడుతూ మండలాల్లో జరుగుతున్న రీ సర్వే పనుల గ్రౌండ్‌ ట్రూథింగ్‌ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రత్యేక శ్రధ్ధ తీసుకోవాలని రెవెన్యూ, సర్వే శాఖల అధికారులను ఆదేశించారు. ప్రతిరోజు 25 ఎకరాలకు మించకుండా రీసర్వే పనుల గ్రౌండ్‌ ట్రూథింగ్‌ ప్రక్రియను పరిశీలిస్తూ విస్తీర్ణ కొలతలు అడిగి తెలుసుకుంటూ మార్పులు లేకుండా రికార్డుల్లో వున్న మేరకు సర్వే పనులు చేపట్టాలన్నారు. చేపట్టిన సర్వే పనులు నిర్దేశిత గడువులోపు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ సరిహద్దు స్థిరీకరణ, స్టోన్ ప్లాంటేషన్ తదితర పనులు కూడా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్‌లో ఉన్న మ్యుటేషన్‌ కరెక్షన్స్‌, మ్యుటేషన్‌ ట్రాన్స్‌యాక్షన్స్‌ సంబంధిత దరఖాస్తులను కూడా దరఖాస్తులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. తాసిల్దార్, సర్వే అధికారులు, గ్రామ రైతులు , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా .. మహిళలకు పోషకహారం, యోగ ఆసనాలు మానసిక వత్తిడి ఫై గురించి అవగాహనా కార్యక్రమం.

 V POWER NEWS  : కర్నూల్ జిల్లా స్త్రీ శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిని ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా వారోత్సవాలు మార్చ్ 1 నుండి 8వరకు వారోత్సవాలు జరుగుతున్నాయి.స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి. నిర్మల ఆదేశాల మేరకు కార్యక్రమం లో భాగంగా మహిళలకు పోషకహారం గురించి అవగాహనా కల్పించారు . అన్ని చిరుదన్యాలు, ఆకుకూరలు, కూరగాయల ప్రదర్శనను ఏర్పాటు చేసి మహిళలకు వివరించడం జరిగింది. అలాగే యోగ చెయ్యడం ద్వారా మహిళలు , మానసిక వత్తిడిలకు లోను కాకుండా ఉండడానికి సహాయపడుతుంది. మహిళలు ఇంట్లో గూడా యోగ ఆసనాలు చేసుకోవడం వలన మానసిక వత్తిడికి గురి కాకుండా ఉంటారని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో వన్ స్టాప్ సెంటర్ కౌన్సిలర్ సునీత పారా మెడికల్ పి. రేష్మ పాల్గొన్నారు.

సీనియర్ పాత్రికేయుడు జోసెఫ్ చంద్రశేఖర్ కు ఆపరేషన్ విజయవంతం .. నంద్యాల APWJF జిల్లా నాయకుడు పరామర్శించినా మౌలాలి

V POWER NEWS  … ATMAKUR :  ఆత్మకూరు పట్టణంలో సోమవారం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ప్రజాశక్తి సీనియర్ పాత్రికేయుడు జోసఫ్ చంద్రశేఖర్ కు కాలు చిటికెన వేలు విరిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే మంగళవారం జోసఫ్ చంద్రశేఖర్ కు ఆపరేషన్ విజయవంతం కొనసాగడంతో ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అసోసియేషన్ నంద్యాల జిల్లా నాయకులు మౌలాలి హాస్పిటల్ వెళ్లి ఆత్మకూరు ప్రజాశక్తి విలేఖరి జోసెఫ్ చంద్రశేఖర్ ఆరోగ్య స్థితిగతులపై అడిగి తెలుసుకున్నారు

కౌతాళం మండలం నూతన MPDO ఇన్చార్జి గా బాధ్యతలు స్వీకరించిన సత్యన్న ..

మర్యాద పూర్వకంగా కలిసినా మంత్రాలయం తెదేపా సీనియర్ నాయకులు చూడి ఉలిగయ్య , అడివప్ప గౌడ్ మరియు పట్టాభి… V POWER NEWS  : కౌతాళం నూతన ఇన్చార్జి ఎంపిడిఓ గా బాధ్యతలు స్వీకరించిన సత్యాన్న గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు నాయకులు.అటు ప్రభుత్వం ఇటు ప్రజలతో మమేకమై పనిచేయ్యాలని, రిటైర్డ్ అయిన సుబ్బరాజు వారిలా పనిచేసి మండల అభివృద్ధికి కృషి చెయ్యాలని సూచించారు. అన్ని అనుబంధ అధికారులతో సమన్వయం చేసుకొని స్నేహపూర్వకమైన సేవ అందించాలని,మండలానికి అభివృద్ధి సంక్షేమం అందించి ప్రజల మన్నలు పొంది,ఉన్నత అధికారుల చేత ప్రశంసలు పొందాలని కోరుకుంటూ కూటమి ప్రభుత్వానికి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమాములో కూటమి పార్టీ నాయకులు రామాలింగ , చంద్రన్న ,మారెప్ప,లక్కే గోవిందు, కురువ నాగేష్,రంగస్వామి,మాకన్నా,శివ చూడి,అమ్ము వలీమహాదేవ,శ్రీరామ్ మొదలగు వారు పాల్గొనడం జరిగినది.

భ్రూణ హత్యలను సంపూర్ణంగా నివారిద్దాం’..

స్కానింగ్ కేంద్రాలపై ఖచ్చితమైన సమాచారం అందించిన వారికి 25 వేల నుండి లక్ష రూపాయల వరకూ బహుమతి అందించే అవకాశం. … నిబంధనలు ఉల్లంగించిన వారిపై 50 వేల జరిమనా నుండి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష. ..లింగ నిర్ధారణ చేసే స్కానింగ్ కేంద్రాలను ఉపేక్షించొద్దు. … రానున్న రోజుల్లో లింగ నిర్ధారణ, భ్రూణ హత్యలు, పీసీ పీఎన్డీటీ చట్టంపై అవగాహన కార్యక్రమాలు. V POWER NEWS  .. ADONI :    సమాజంలో లింగ అసమానతలకు కారణమవుతున్న భ్రూణ హత్యలను సంపూర్ణంగా నివారించేందుకు కృషిచేయాలని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పిలుపునిచ్చారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ పీసీ పీఎన్డీటీ చట్టాన్ని ఉల్లంఘిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని సబ్ కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు.మంగళవారం సబ్ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో భృణ హత్యలు నివారించడం పీసీ పీఎన్డీటీ చట్టంపై ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం డివిజన్ లోని స్కానింగ్ నిర్వాహకులు, ప్రైవేట్, ప్రభుత్వ వైద్య అధికారులకు, మరియు సంబంధిత అధికారులతో , సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ… తల్లిందండ్రుల ఆలోచనా విధానంలో మార్పులు తీసుకురావడం ద్వారానే భ్రూణ హత్యలను నివారించగలమన్నారు. రానున్న రోజుల్లో గర్భస్థ శిశువులపై లింగ వివక్షకు వ్యతిరేకంగా, పీసీ పీఎన్డీటీ చట్టంపై అవగాహన కలిగించాలని నిర్ణయించారు. లింగ నిర్దారణ చేసే స్కానింగ్ కేంద్రాలపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. నిబంధనలు ఉల్లంగించిన వారిపై 50 వేలు జరిమాన నుండి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుందన్నారు. పీసీ పీఎన్డీటీ చట్టం ప్రకారం స్కానింగ్ కేంద్రాలపై ఖచ్చితమైన సమాచారం అందించిన వారికి 25 వేల నుండి లక్ష రూపాయల వరకూ బహుమతి అందించే అవకాశం ఉందన్నారు.ఆదోని డివిజన్ పరిధిలో 48 స్కానింగ్ కేంద్రాలు ఉండగా. డివిజన్లో ఉన్న స్కానింగ్ కేంద్రాన్ని ప్రతి 3 నెలలకు ఒకసారి తనిఖీ చేసి నూతన రిజిస్ట్రేషన్లు, రెన్యూవల్, సిబ్బంది, చిరునామా, పరికారాల్లో మార్పులు వంటి అంశాలపై తనిఖీ చేసి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా స్కానింగ్ సెంటర్లను అనుమతులు రద్దు చేయాలన్నారు.ఈ సందర్భంగా డి.ఎస్.పి హేమలత మాట్లాడుతూ…భ్రూణ హత్య అనేది సమాజానికి కలిగే తీవ్ర అనర్థం మాత్రమే కాకుండా, చట్టపరంగా కూడా నేరం. గర్భంలో ఉండగానే లింగ నిర్ధారణ చేసి, ఆడ శిశువులను నిర్దాక్షిణ్యంగా హత్య చేయడం మన సమాజం ఎదుట ఉన్న సవాలుగా మారింది. భారతదేశంలో “పురుష-స్త్రీ నిష్పత్తి” అసమతుల్యతకు ప్రధాన కారణంగా భ్రూణ హత్యలు ఉన్నాయి. ఇది భవిష్యత్ తరాలకు తీవ్ర ప్రభావం చూపిస్తుంది. “భ్రూణ హత్య నిషేధ చట్టం – 1994 (PCPNDT Act)” ప్రకారం, గర్భంలో ఉన్న శిశువు లింగ నిర్ధారణ చేయడం మరియు భ్రూణ హత్య చేయడం చట్టబద్ధంగా నిషేధించబడింది. ఆడ పిల్లల తల్లిదండ్రులుకు చదువు యొక్క విలువలను తెలియజేసి ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలు సద్వినియోగం చేసుకుని వారిని ఉన్నత శిఖరాలకు వెళ్ళే విధంగా వారికి అవగణ కల్పించాలని సంబంధిత అధికారులకు డి.ఎస్.పి హేమలత సూచించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంహెచ్వో సత్యవతి మాట్లాడుతూ…లింగ నిర్ధారణ చేయకుండా ఉండటం – వైద్యులు ఎవరూ గర్భంలోని శిశువు లింగాన్ని నిర్ధారించరాదన్నారు. నైతిక వైద్య సేవలు అందించడం – పేదరికం, కుటుంబ ఒత్తిళ్ల వలన భ్రూణ హత్యకు ఒత్తిడి ఎదుర్కొనే తల్లులకు మానసిక, వైద్య పరమైన సలహా అందించాలన్నారు. చట్టాన్ని కఠినంగా పాటించడం – PCPNDT చట్టాన్ని ఉల్లంఘించే ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.సామాజిక అవగాహన పెంచడం – భ్రూణ హత్యల హానికారక ప్రభావాల గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ముఖ్యంగా ఆడ పిల్లల ప్రాముఖ్యతను గుర్తించడం – బాలికల హక్కులను ప్రోత్సహిస్తూ, “బేటీ బచావో – బేటీ పడావో” వంటి ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.ఈ సమావేశంలో డి.ఎస్.పి హేమలత, డిప్యూటీ డి.యం.హెచ్.వో డాక్టర్ సత్యవతి, జిల్లా నోడల్ అధికారి డాక్టర్ నాగ ప్రసాద్, డెమో అధికారి శ్రీనివాసులు, డిప్యూటీ డెమో అధికారి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా మానిటరింగ్ కన్సల్టెంట్ అధికారి సుమలత, సిడిపిఓస్ సఫర్ నిషా బేగం, ఉమ మహేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

సైనికుల త్యాగం గొప్పది వారి కుటుంబాలకు ఉచిత వైద్యం అందించడం అదృష్టంగా భావించాలి … నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి.

– మూగ, చెవిటి పిల్లల తల్లిదండ్రుల కష్టం వర్ణనాతీతం. – వైద్య సేవల్లో నంద్యాల జిల్లాను మొదటి స్థానంలో నిలుపుదాం. — నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. V POWER NEWS  …NANDYAL  :   దేశ రక్షణలో సైనికుల త్యాగం వెలకట్టలేనిదని, వారి కుటుంబాలకు ఉచిత వైద్యం అందించడం ప్రతి వైద్యుడు అదృష్టంగా  మూగ, చెవిటి పిల్లల తల్లిదండ్రుల కష్టం వర్ణనాతీతమని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.  సోమవారం ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్బంగా నంద్యాల మధు మణి ఆసుపత్రి ఆవరణలో నంద్యాల భారతీయుల వైద్యుల సంఘం ఆధ్వర్యంలో  వీర సైనికునికి వందనం పేరుతో ఆర్మీ, నేవి, ఎయిర్ ఫోర్స్ లలో పనిచేస్తున్న సైనికులకు, వారి కుటుంబ సభ్యులకు నంద్యాలలోని అన్ని ప్రయివేట్ ఆసుపత్రుల్లో ఉచిత ఓ పి డి చికిత్సలు, వినికిడి లోపల ఉన్న నిరుపేదలకు ఉచితంగా చెవిటి మిషన్లు ( వినికిడి యంత్రాలను ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పంపిణి చేశారు.  ఈ సందర్బంగా ఎంపీ శబరి మాట్లాడుతూ దేశ సేవలో సైనికుల త్యాగం గొప్పదని వారికీ, వారి కుటుంబాలకు ప్రయివేట్ ఆసుపత్రులలో ఉచిత వైద్యం అందించడం అభినందనీయం అన్నారు.  అలాగే మధు మణి ఆసుపత్రి ఆధ్వర్యంలో డాక్టర్ మధుసూదనరావు  రూ 1000/- విలువైన వినికిడి పరీక్ష (OAE) పూర్తిగా ఉచితంగా, వినికిడి సమస్యల వారికి ఉచిత పరీక్షలు చేయడం,  పుట్టు, మూగ, చెవిటి పిల్లలు శబ్దాలు విన్నా తిరిగి చూడని పిల్లలు, రెండు అక్షరాల పదాలు అత్త, మామ, అమ్మ,అని కూడా పలుకలేకపోయిన నిరుపేదలకు  ఉచితంగా వినికిడి యంత్రాలు అందించడం,  2-3 సంవత్సరాలైనా అందరి పిల్లల మాట్లాడకపోయిన వారి రెండు చెవులకు 13 లక్షల విలువైన కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీని మధుమణి నర్సింగ్ హోమ్ నందు డా. ఎన్. టి. ఆర్ వైద్య సేవ & CMRF ద్వారా ఉచితంగా చేయడం అభినందనీయం అన్నారు. భారతదేశంలో నంద్యాల లాంటి చిన్న జిల్లాలలో 150 ఇంప్లాంట్ ఆపరేషన్లు చేసిన ఏకైక ఆసుపత్రి మధుమణి నర్సింగ్  గర్వాంగా ఉందన్నారు.  అందరు డాక్టర్ల సహకారంతో  నంద్యాల జిల్లాను వైద్య సేవల్లో మొదటి స్థానం నిలుపుదాం అని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పిలుపు నిచ్చారు. నంద్యాల వైద్యుల బృందంను త్వరలో ఢిల్లీలోని డిఫెన్స్ మంత్రి వద్దకు తీసుకెళ్లుతానని ఆమె చెప్పారు. రాష్ట్రంలోనే నంద్యాల వైద్యుల ఉచిత సేవలు గొప్పవని చాటుద్దాం అన్నారు.  ఈ కార్యక్రమంలో  టీడీపీ నాయకులు ఎన్ ఎం డి ఫయాజ్, ఎంపీ శబరి గురువు లు డాక్టర్ ఫణిందర్, నంద్యాల ఐ ఎం ఏ అధ్యక్ష, కార్యదర్సులు మధుసూదనరావు, జి. రవికృష్ణ, డాక్టర్లు నాగమణి, మాధవి, మణిదీఫ్, ఎం. వెంకట మస్తానయ్య, రోహిత్, తదితర వైద్యులు ఉన్నారు.

విద్య అభివృద్ధికి అధికార్లు కృషి చేయాలి …

కూటమి ప్రభుత్వం విద్య అబివృద్దికి పెద్దపీట వేస్తోంది.. ఆలూరు టీడిపి ఇంచార్జీ వీరభద్ర గౌడ్ V POWER NEWS  :  కర్నూలు జిల్లా, ఆలూరు నియోజకవర్గంమునకు సోమవారం నాడు  ప్రత్యేక అధికారిగా నియామకం అయిన అజయ్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిసి కూటమి ప్రభుత్వం రద్దు చేసిన పాఠశాలల విలీనం జీవో ను అందజేశారు. మంత్రి నార లోకేష్ అసెంబ్లీ లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తానని ప్రకటించడం హర్షణీయమన్నారు. విద్య వ్యవస్థను గత వైసిపి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తే కూటమి ప్రభుత్వం విద్య అబివృద్దికి పెద్ద పీట వేస్తుడన్నారు..తల్లికి వందనం కూడా ప్రతి విద్యార్థికి అందిస్తామని సిఎం ప్రకటించి బడ్జెట్ కూడా కేటాయించారన్నారు.  ఆయన వెంట ఆలూరు ఎంఈఓ- 2 చిరంజీవి రెడ్డి, విద్య శాఖ అధికార్లు అన్నారు.

మహిళా దినోత్సవం వారోత్సవాలు విజయవంతం చేయండి – ఐసిడిఎస్ అధికారి పీ.నిర్మల

 V POWER NEWS  : కర్నూల్ జిల్లా స్త్రీ శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిని ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా వారోత్సవాలు మార్చ్ 1నుండి 8వరకు మహిళా హక్కులు,సమాన వేతనం, పనిలో గౌరవం ఉండాలని మరియు ఈరోజు కార్యక్రమం లో బాల్యవివాహలకు వ్యతిరేకంగా ఆయా మత పెద్దలతో మరియు మహిళలతో కాండిల్స్ వెలిగించుకొని సంతోషనగర్ నుండి గీతముఖర్జీ నగర్ లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమం లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారిని p. నిర్మల, వన్ స్టాప్ సెంటర్ అడ్మిన్ p. మేరీస్వర్ణలత, WASI G. లలితమ్మ osc సిబ్బంది అంగన్వాడీ వర్కర్స్, మహిళలు పాల్గొన్నారు.

పసికందుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న డాక్టర్ రాకేష్ రెడ్డి పైన కేసు నమోదు చేయాలి — PDSU-PYL సంఘాల డిమాండ్.

డబ్బులు దండుకొని వైద్యం చేయకుండా పసికందు మృతికి కారణమైన డాక్టర్ రాకేష్ రెడ్డి తక్షణమే అరెస్టు చేయాలి. …. లేనిపక్షంలో పిడిఎస్యు-పివైఎల్ సంఘాల ఆధ్వర్యంలో మధు చిన్నపిల్ల హాస్పిటల్ ఎదుట ప్రత్యక్ష ఆందోళన సిద్ధం అవుతాయo ….   V POWER NEWS   : నంద్యాల పట్టణంలో మధు చిన్న పిల్లల ఆస్పత్రిలో వైద్యం వికటించి పసికందు మృతి కారకులైన డాక్టర్లను కఠినంగా శిక్షించాలని PDSU రాష్ట్ర అధ్యక్షులు S.M.D.రఫీ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పసికందు మృతి సంఘటన పైన సమగ్ర విచారణ చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈరోజు జిల్లా కేంద్రంలో పుట్టగొడుగుల పుట్టుకొస్తున్న హాస్పటలకు ఎటువంటి పర్మిషన్ లేకుండా డబ్బే ధ్యేయంగా నడుపుతున్న హాస్పిటల్ పైన DMHO వత్తాసుపలుకుతున్నారని వారు ఆరోపణ చేశారు. అయితే నంద్యాల పట్టణంలో మధు చిన్న పిల్లల హాస్పిటల్లో ఈరోజు జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమని గత 21 రోజులుగా వైద్యం అందిస్తున్నామని నటిస్తూ దాదాపుగా నాలుగు లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేసి ఒక పసికందు మృతికి కారణమైనటువంటి మధు చిన్నపిల్లల హాస్పిటల్ డాక్టర్ రాకేష్ రెడ్డి ని తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. అయితే నంద్యాల పట్టణంలో రోజుకు హాస్పిటల్ పూటకు ఒక హాస్పిటల్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయంటే ప్రధాన కారణం జిల్లా వైద్యశాఖ అధికారులే అని ఆరోపించారు ఎందుకంటే కనీసం మౌలిక సదుపాయం లేకుండా పార్కింగ్ స్థలం లేకుండా ఫైర్ సర్టిఫికెట్లు లేకుండా అర్హత కలిగినటువంటి డాక్టర్లు లేకుండా వైద్య చదువును చదువుకున్నటువంటి వాళ్ళు కాకుండా వైద్య విద్యను కొని డాక్టర్లుగా పొందినటువంటి డాక్టర్లు ఉండడం ఇటువంటి అంశాలపైన ఏమాత్రం ఆలోచన చేయకుండా ఇష్టారాజ్యంగా జిల్లా వైద్య శాఖ అధికారులు అనుమతులు ఇవ్వడమే ప్రధాన కారణమని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి నంద్యాల పట్టణంలోని మధు చిన్నపిల్లల హాస్పిటల్ లో పసికందు మృతి పై సమగ్ర విచారణ జరిపించి డాక్టర్ రాకేష్ రెడ్డి పై క్రిమినల్ కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేసి హాస్పిటల్లో సీడ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాకాకుండా ఈ సమస్యను తప్పుదో పట్టించేందుకు డిఎంహెచ్ఓ పై స్థాయి అధికారులు ప్రయత్నం చేసి డాక్టర్ రాకేష్ దగ్గర నుండి మూడు పూలు తీసుకొని ఆ పసికందు మృతి పైన ఎటువంటి విచారణ చేయకపోతే పిడిఎస్యు పి వై ఎల్ సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతామని వారు హెచ్చరించారు. నంద్యాల పట్టణంలో ప్రైవేట్ హాస్పిటల్లో దందా కొనసాగుతున్నప్పటికీ, విచ్చలవిడిగా ఓ పిల్ల పేరుతో వివిధ రకాల టెస్టుల పేరుతో స్కానింగ్ లో పేరుతో డబ్బులు వసూలు చేస్తు పేద ప్రజల రక్తాన్ని జలగల్లా పిలుస్తున్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ లో పైన చర్యలు తీసుకోకుండా నిమ్మకు నినెత్తినట్టుగా వ్యవహరిస్తున్నటువంటి డిఎంహెచ్ఓ పైన జిల్లా వైద్యశాఖ అధికారుల పైన విచారణ చేపట్టి ఈ విషయం పైన జిల్లా కలెక్టర్ గారి రంగ ప్రవేశం చేసి ప్రైవేట్ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి నిలువు దోపిడీ పైన చర్యలు చేపట్టాలని వారు కోరారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి ప్రైవేట్ డాక్టర్లపైన ఎందుకంత ప్రేమ చూపిస్తున్నారో అర్థం కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి తక్షణమే రాకేష్ రెడ్డి హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలి హాస్పిటల్లో సీజ్ చేయాలి రాకేష్ రెడ్డి అరెస్ట్ చేయాలి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధికి తోడ్పడేలా వార్షిక బడ్జెట్ ఉంది .. ఎమ్మెల్యే గిత్త జయసూర్య

V POWER NEWS :    2025 – 26 ఆర్థిక సంవత్సరానికిగాను కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధికి తోడ్పడేలా ఉందని, అభివృద్ధి సంక్షేమం సమానంగా ఉండేలా రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుగారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసిన నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గిత్త జయసూర్య. https://youtu.be/v25g61Yoj80?si=S3I-TXV5H8ZBU2kJ

error: Content is protected !!