– పోలీసులు కేసు నమోదు చేసి .. న్యాయంచేయాలని శిరీష రోదిస్తూ ఆవేదన
కర్నూలు జిల్లా, ఆదోని డివిజన్ కోసీగి మండలానికి చెందిన శిరీష కొన్ని సంవత్సరాల క్రితం ప్రేమ పెళ్లి వేసుకుందని ఆమె తెలిపారు. ప్రేమ పెళ్లి చేసుకున్నప్పటి నుండి భర్త వారింట్లో వేదింపులకు పెట్టారని శిరీష రోదిస్తూ తెలిపారు. నా భర్త మద్యం కు బానిసై అనారోగ్యంతో మృతి చెందాడని భార్య వాపోయింది. అయితే భర్తను పోగొట్టుకున్న భార్య శిరీషను తమ పుట్టింటికి వచ్చినానని ఆమె తెలిపారు. అయితే నా భర్తకు రావలసిన ఆస్తి కి అడ్డు అవుతుందని నన్ను నా పిల్లలను చంపేస్తే అడ్డు ఉండదని ఆలోచనతో శిరీష ఇంటిపై బావ నరసింహులు, మరిది హరి, ఆడపడుచు భర్త కర్రలతో ఇనుప రాడ్తో దాడి చేశారని నా తమ్ముడికి బలమైన గాయాలైనాయని శిరీష రోదిస్తూ వాపోయింది. అలాగే నిన్ను చంపేస్తాం మీకు ఎవరు అడ్డు వస్తారని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని శిరీష ఆరోపించింది. నా కుటుంబ సభ్యులకు నా పిల్లలకు, రక్షణ కల్పించాలని పోలీస్ వారిని వేడుకుంది. దాడి చేసిన వారిపై కేసు నమోదుచేసి నా పిల్లలకు నాకు న్యాయం చేయాలని పోలీస్ వారిని బాధితురాలు శిరీష రోదిస్తూ వేడుకుంది.