ఆంధ్ర ప్రదేశ్

వన్ స్టాప్ సెంటర్లో .. 10 రోజుల ప్రత్యేక అవగాహనా కార్యక్రమం

V POWER NEWS  KURNOOL  TOWN:    జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి పి. విజయ గారి ఆధ్వర్యంలో DWCW లో  భాగమైన వన్ స్టాప్ సెంటర్ ద్వారా 10 రోజుల ప్రత్యేక అవగాహనా కార్యక్రమం లో భాగంగా మొదటి రోజు   జిల్లా సూపెరవైజర్స్ మరియు రవీంద్ర డిగ్రీ కాలేజీ స్టూడెంట్స్ దగ్గర అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మిషన్ శక్తి లో ఉన్న హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఉమెన్స్, ఓఎస్సీ సేవలు,శక్తి నివాస్ మరియు శక్తి సదన్ మహిళ హెల్ప్ లైన్, చైల్డ్ హెల్ప్ లైన్ పాలసీ ల గురించి వివరించారు. కార్యక్రమం లో మిషన్ కోఆర్డినేటర్ బాలమణి, మేరీ స్వర్ణలత, సునీత, విజయకుమారి మరియు జోష్టనా ప్రియాంక పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరు మట్టి వినాయకులను ప్రతిష్టించేలా కృషి చేయాలి..

సమస్యల పరిష్కారానికి ఆత్మ విశ్వాసంతో మహాదేవుణ్ణి ప్రార్టించుకోవాలి.. కర్నూలు రూరల్ తహసీల్దార్ టి.రమేష్ బాబు, లక్ష్మీనారాయణ ఏపీ టూరిజం డివిజనల్ మేనేజర్ V POWER NEWS’  KURNOOL TOWN :    సమస్యల పరిష్కారానికి ఆత్మ విశ్వాసంతో మహాదేవుణ్ణి ప్రార్టించుకోవాలని కర్నూలు రూరల్ తహసీల్దార్ టి.రమేష్ బాబు సూచించారు.సోమవారం కర్నూలు నగరం,జిల్లా కలెక్టర్ కార్యాలయం, సమాచార శాఖ భవన్ ప్రాంగణంలో పాత్రికేయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పాత్రికేయ వినాయకుణ్ణి ప్రతిష్టించి,నేటికి ఆరవ రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆరవ రోజు పూజలకు కర్నూలు రూరల్ తహసీల్దార్ టి.రమేష్ బాబు,ఉమ్మడి ఎపి టూరిజం అధికారి లక్ష్మి నారాయణ,సిటీ కేబుల్ మహేష్, శ్రీ చక్ర దిన పత్రిక ఎడిటర్ హరినాధ రెడ్డిలు దర్శించుకుని,ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్బంగా తహసీల్దార్ టి.రమేష్ బాబు మాట్లాడుతూ పాత్రికేయులు సైతం పర్యావరణం కాపాడుటలో కృషి చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. వినాయక చవితిని పురస్కరించుకొని మట్టి వినాయకున్ని ప్రతిష్టించడమే కాకుండా దాతల సహకారంతో ఉదయం, సాయంత్రం అల్పాహారం మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమాలు జరపడం అభినందనీయం అని కొనియాడారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరు మట్టి వినాయకులను ప్రతిష్టించేలా కృషి చేయాలనీ వారు పిలుపునిచ్చారు. అనంతరం వారికీ పాత్రికేయ ఉత్సవ కమిటీ బృందం శాలువా మోమేంటోలతో ఘనంగా సన్మానం చేశారు.తదనంతరం ఆల్ఫాహారం వడ్డించారు.ఈ కార్యక్రమం లో కమిటీ బృందం శ్రీనివాసులు, విద్యాసాగర్, మంజునాద్, రామకృష్ణ, జి.విజయ్ కుమార్,అవినాష్,మోహన్,వి. విజయ్ కుమార్, అంజి, కిషోర్, ఇతర పాత్రికేయులు,భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

అంగరంగ వైభవంగా .. రాజా వీధి శ్రీ వరసిద్ధి గణనాధుణి నిమజ్జనం

శ్రీ దత్త ఉపాసకులు భాస్కర స్వామిజి కపిలేశ్వరం దుర్గామాత దేవస్థానం పీఠాధిపతి సమక్షంలో .. అంగరంగ వైభవంగా గణనాధుణి నిమజ్జనం, భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ నంద్యాల జిల్లా,నందికొట్కూరు పట్టణంలోని రాజావిధి శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ్ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నిమజ్జనం అంగరంగ వైభవంగా చేపట్టారు.ఈ సందర్బంగా కమిటీ అధ్యక్షులు భాస్కర స్వామి మాట్లాడుతూ రాజావిధి శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో మొదటి దినం నుండి 5వ రోజు నాడు వరకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని చెప్పారు. అదేవిదంగా నిమజ్జనం కార్యక్రమానికి సైతం వందలాది భక్తులకు అన్న ప్రసాదాలు ఎటువంటి లోటు లేకుండా చేయించామన్నారు.అలాగే అనేక పూజలు నిర్వహించి,స్వామివారి కృప దయను భక్తాదులకు అందించడంల శ్రీ దత్త ఉపాసకులు భాస్కర స్వామీజీ కపిలేశ్వరం దుర్గామాత దేవస్థానం పీఠాధిపతి అందించడం జరిగిందన్నారు.అనంతరం శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ్ మండపం వద్ద హోమం నిర్వహించి పూర్ణ ఆహుతి చేయించడం జరిగింది. దానితో నిమజ్జనం ఉత్సవం భక్తాదుల మధ్య నిమజ్జనానికి బయలుదేరిన రాజా వీధి శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని నిమజ్జనం చేసినట్లు శ్రీ దత్త ఉపాసకులు భాస్కర స్వామీజీ కపిలేశ్వరం దుర్గామాత దేవస్థానం పీఠాధిపతి తెలిపారు.

కర్నూలు ప్రజలందరూ..గణనాథుడి ఆశీస్సులతో సుఖసంతోషాలతో ఉండాలి : జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా

గణనాథుడి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు. శనివారం కర్నూలు సమాచార శాఖ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ గణపతిని జిల్లా కలెక్టర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గణనాథుని ఆశీర్వాదంతో ప్రజలందరూ ఆరోగ్యంగా ,ఆనందంగా, సుఖశాంతులతో ఉండాలని కోరారు. అదే విధంగా జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా ముందుకు సాగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. అనంతరం పాత్రికేయ ఉత్సవ గణపతి సమితి సభ్యులు కలెక్టర్ గారికి సన్మానం చేశారు. కర్నూలు జిల్లా కలెక్టర్ తో పాటు సమాచార పౌర సంబంధాల శాఖ ఉప సంచాలకులు కె.జయమ్మ, దేవకాంత్, వడ్డే మోహన్ పాత్రికేయ ఉత్సవ సమితి నాయకులు మంజునాథ్ యాదవ్, రామకృష్ణ, వెంకట సుబ్బయ్య, శ్రీనివాసులు, శ్రీనాథ్ రెడ్డి, అవినాష్ శెట్టి, హరి కృష్ణ, మల్లికార్జున, గంగాధర్, ఇస్మాయిల్, ఆసిఫ్, రాఘవేంద్ర, మధు, పరమేష్, తదితరులు పాల్గొన్నారు.

భాదిత మహిళ లను రక్షించుట కోసం .. టెండర్స్ ఫారం కోరిన జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమము మరియు సాధికారత అధికారి

V power news , kurnool: కర్నూలు  జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమము మరియు సాధికారత అధికారి, కర్నూలు (జిల్లా) గారి అద్వర్యంలో నడపబడుతున్న కర్నూల్ వన్ స్టాప్ సెంటర్ పరిధిలో జిల్లా లోని భాదిత మహిళ లను రక్షించుట కోసం అనే ప్రాతిపదికన 2025 వ సంవత్సరము నకు గాను (మారుతి ECCO కానీ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ తరహాలో ఉండే) వాహనం సమకూర్చుటకు ఆసక్తిగల సరఫరా దారుల నుండి టెండర్ లను కాని కొటేషన్ లను కాని కోరడమైనది. ఆశక్తి కల సరఫరా దారులు రూ.. 3000/- (ఆక్షరాలా మూడు వేల రూపాయిలు మాత్రమె) ధరిపిత్తు జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమము మరియు సాధికారత అధికారి గారి పేరూ పై డి.డి. తీసి కోటేషన్/ టెండర్స్ ఫారం తోపాటూ జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమము మరియు సాధికారత అధికారి కార్యాలయం నందు సంప్రదించి ప్రభుత్వ పని దినమూలందు తేది 25/08/2025 మధ్యాహనం 12 గం.ల లోపు పొందవలయును పూర్తి చేసిన కోటేషన్/ టెండర్ ఫారం ను తేది:30/8/2025 మధ్యాహనం 3 గం. ల లోపు కార్యాలయం నందు అందచేయగలరని కర్నూలుజిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమము మరియు సాధికారత అధికారి,.

బ్రాహ్మణపల్లి .. కానుగుల రాజారావుకు న్యాయం చేయాలి :

 177/C సర్వే నెంబర్ పై  .. తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలి .. ఆర్జీఎన్ హ్యూమన్ రైట్స్ & యాంటీ కరప్షన్ అసోసియేషన్ ఎపి ఇంచార్జి విజయ్ కుమార్ V POWER NEWS: కర్నూలు ఓర్వకల్ మండలం,బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన కానుగుల రాజారావుకు న్యాయం చేయాలనీ ఆర్జీఎన్ హ్యూమన్ aరైట్స్ & యాంటీ కరప్షన్ అసోసియేషన్ ఎపి ఇంచార్జి విజయ్ కుమార్ అధికారులను కోరారు. గురువారం ఆర్జీఎన్ హ్యూమన్ రైట్స్ & యాంటీ కరప్షన్ అసోసియేషన్ కర్నూలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎపి ఇంచార్జి విజయ్ కుమార్,ఆర్గనైజింగ్ సెక్రటరీ సత్యనారాయణ,జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్,ఉపాధ్యక్షులు పరమేష్ లతో కలిసి గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం,జాయింట్ కలెక్టర్ నవ్యను కలిసి బాధితుడు కానుగుల రాజారావుకు జరిగిన అన్యాయంపై న్యాయం చేయాలనీ కోరుతూ వినతిపత్రం అందచేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కర్నూలు జిల్లా, ఓర్వకల్ మండలం, బ్రాహ్మణపల్లి గ్రామంలోని 177/C సర్వే నెంబర్లులో ఐదు ఎకరాల భూమిని కానుగుల సత్యరాజు కుటుంబ సభ్యులు రెండు తరాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో వారసత్వంగా కానుగుల రాజారావు సైతం భూమిలో అనుభవంలో ఉన్నాడు. అయితే ఎపిఐఐసి వారు సర్వే రిపోర్ట్ లో మండల రెవెన్యూ, రెవెన్యూ డివిజన్ అధికారులు ఇచ్చిన తప్పుడు సమాచారం ద్వారా బాధితుడికి అన్యాయం జరిగిందని చెప్పారు. వారి రిపోర్ట్ ఆధారంగా ఎపిఐఐసి వారు ఎలాంటి విచారణ చేపట్టకుండానే బాధితుడు సాగు చేసుకుంటున్న భూమిని స్వాదినం చేసుకునేందుకు ప్రయత్నం జరుగుతుంది అని పేర్కొన్నారు. భూమిలోకి రైతు కానుగుల రాజారావును భూమి సాగుచేయకుండా భయాందోళనకు గురిచేయడం బాధాకరమని ఆవేదన చెందారు. బాధితుడు కానుగుల రాజారావు న్యాయం కోసం జిల్లా అధికారులు, డివిజన్ మండల రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగి అనేక దపాలుగా ఫిర్యాదు చేసిన అధికారులు స్పందించకపోవడం సరైందికాదన్నారు.కావున ఇప్పటికైనా బాధితుల సమస్యపై సమగ్ర విచారణ చేపట్టి, ప్రస్తుతం APIIC ZO కి బాధితులను మానవతా దృక్పధం తో 2014-2015 సంవత్సరం భూసర్వేలో జరిగిన అవకతవకలను గుర్తించి, బాధితుడికి తగిన నష్టపరిహారం అందించడంతోపాటు,బాధితుడిని ఎటువంటి ఇబ్బందులకు గురిచేయకుండా తగిన న్యాయం చేయాలనీ,లేనిపక్షంలో బాధితుడి తరుపున ఓర్వకల్ మండల రైతులను చైతన్యం చేసి ఆర్జియన్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోరాటం సాగిస్తామని వారు తెలిపారు.

నంద్యాల జిల్లాలో  .. పరిశ్రమల ఏర్పాటుకు చక్కని అవకాశాలు .. జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

వర్కింగ్ క్యాపిటల్ ద్వారా యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం .. సులభతర ప్రభుత్వ అనుమతులకు త్వరితగతిన చర్యలు : జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా నంద్యాల జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు గాను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పేర్కొన్నారు. అనంతరం మంగళవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై యువ పారిశ్రామికవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ….జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు చేయూతను ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం యువ పారిశ్రామికవేత్తలకు అండగా ఉంటుందన్నారు. పరిశ్రమల స్థాపనకు అవసరమయ్యే పెట్టుబడి సాయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించేలా చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుండి కూడా సులభతరంగా పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఎక్కువ శాతం హార్టికల్చర్, పసుపు, సుగంధ ద్రవ్యాలు, పూలు, పండ్ల మొక్కల పెంపకం ఎక్కువ శాతం చేపట్టడం జరుగుతుందన్నారు. జిల్లాలో సుమారుగా 33 శాతం అటవీ ప్రాంతం ఉండగా, 1/3 వంతూ సాగు భూమి ఉండగా, అందులో ఎక్కువ శాతం వరి, జొన్న తదితర పంటలను పెద్ద ఎత్తున సాగు చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నంద్యాల సోనా బియ్యాన్ని సరఫరా చేయడం జరుగుతోందన్నారు. అదే విధంగా పశు సంపద కూడా జిల్లాలో సమృద్ధిగా ఉందన్నారు. జిల్లాలోని బనగానపల్లె, డోన్ ప్రాంతాల్లో 90 శాతం సున్నపు రాయి పరిశ్రమలతో పాటు 10 శాతం ఇనుప ఖనిజం లవణాలు ఉండడం వల్ల మైనింగ్ కార్యకలాపాలు నిర్వహణకు పెద్ద ఎత్తున అవకాశాలు ఉంటాయన్నారు. అంతేకాకుండా స్థూల జిల్లా దేశీయ ఉత్పత్తి పెరుగుదలకు గాను వ్యవసాయం మరియు అనుబంధ కార్యకలాపాల ద్వారా 42 శాతం, సేవా రంగాలకు 39 శాతం, పరిశ్రమల పరంగా 19 శాతం ద్వారా సేవలు అందజేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు గాను రాష్ట్ర ప్రభుత్వం వైపు నుండి పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందించే అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయడానికి ఉత్సాహవంతులైన పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలన్నారు. సదరు సంస్థల ఏర్పాటుకు బ్యాంకర్స్ వైపు నుండి కూడా పూర్తి సహకారం అందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జిఎం ఎస్.మహబూబ్ బాషా, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నారాయణరెడ్డి, కార్మిక శాఖ సహాయక కమీషనర్ బషీర్రునిస్సా బేగం, కాలుష్య నియంత్రణ సంస్థ ఈఈ కిషోర్ రెడ్డి, పారిశ్రామికవేత్తలు తదితరులు పాల్గొన్నారు.

ఆకస్మికంగా .. ముస్తపల్లె రైతుసేవా కేంద్రాన్ని తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ సి .విష్ణు చరణ్

రైతులకు యూరియా సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలి… నంద్యాల  జిల్లా,  ఆత్మకూరు మండలంలోని రైతులకు యూరియా సమస్య తలెత్తకుండా తగు చర్యలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ పేర్కొన్నారు. సోమవారం జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ ఆత్మకూరు మండలం, ముస్తపల్లె గ్రామంలోని రైతు సేవా కేంద్రం, వసుంధర ఎరువుల దుకాణంలో నిల్వ ఉంచిన యూరియా నిల్వలను పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ మాట్లాడుతూ…. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ సరిపడా యూరియా అందజేయడం జరుగుతుందన్నారు. యూరియా సరఫరాలో రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కరికి యూరియా ఇవ్వడం జరుగుతుందన్నారు. రైతులు పంటకు సరిపడా యూరియా మాత్రమే వాడాలని యూరియాను అధిక మోతాదులో వాడి పంట దిగుబడి కోల్పోరాదన్నారు. ప్రభుత్వం ఏ సీజన్ కు సంబంధించి ఆ సీజన్లో రైతులకు సరిపడా యూరియా అందజేయడం జరుగుతుందని రైతులు రబి సీజన్ కు  సంబంధించి ముందుగానే యూరియా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. రైతుల నుంచి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా యూరియా సక్రమంగా సరఫరా చేయాలని ఆర్ఎస్కే సిబ్బందికి సూచించారు.  ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి హేమలత, రైతు సేవా కేంద్రం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. 

జనసేనా అధినేత జన్మదిన సందర్భంగా.. సెప్టెంబర్ 2 వరకు తేది రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినా సంధ్యా విక్రమ్ కుమార్

V POWER NEWS  :  కర్నూలు జిల్లా, కోడుమూరు నియోజకవర్గంలో సెప్టెంబర్ రెండో తేదీన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ a పుట్టినరోజు సందర్భంగా కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం సి. బెలగల్ మండల కేంద్రంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు సంధ్యా విక్రమ్ కుమార్ చెప్పారు. అన్ని దానాల కంటే రక్తదానం గొప్పది కాబట్టి మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ఇష్టమైన సామాజిక సేవ కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్క జనసేన నాయకుడు, కార్యకర్త హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. కోడుమూరు నియోజకవర్గంలో ప్రతి జనసేన సైనికుడు ,కార్యకర్త, ప్రజలందరూ కలిసికట్టుగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి పవన్ కళ్యాణ్ గారికి బహుమతిగా ఇస్తామని సంధ్య విక్రమ్ కుమార్ కోరారు. అలాగే రానున్న రోజులు జనసేన పార్టీని బలోపేతం చేయాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన కార్యకర్తలు నాయకులు హాజరయ్యారు.

ప్రశ్నించడమే మనిషి హక్కు .. సమాజం అభివృద్ధికి యువత కృషి చేయాలి : స్పెషల్ పోలీస్ డిఎస్పీ మహబూబ్ బాషా

సమాజంలో జరుగుతున్న లోపాలను ప్రశ్నించడమే మనిషి హక్కు.. కర్నూలు జిల్లా,కల్లూరు మండలం శుక్రవారం నాడు ఎంపీడిఓ కార్యాలయం బిసి స్టడీ సర్కిల్ లో RGN హ్యూమన్ రైట్స్ & యాంటీ కరప్షన్ అసోసియేషన్ జిల్లా కమిటి ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బి.ఆజాద్,జిల్లా ఉపాధ్యక్షులు పరమేష్ అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశా నికి స్పెషల్ పోలీస్ డిఎస్పీ మహబూబ్ బాషా,ఎపి ఇంచార్జి జి.విజయ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సత్యనారాయణ, యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం జిల్లా నాయ కులు విజయ్ కుమార్ హాజరయ్యారు.   ఈ సందర్బంగా స్పెషల్ పోలీస్ డిఎస్పీ మహబూబ్ బాషా మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న లోపాల పట్ల ప్రశ్నించే స్థాయికి యువత అవగాహన పెంచాకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రశ్నించినపుడే సమస్యకు న్యాయం జరుగుతుంది అన్నారు.ప్రస్తుతం సమాజంలో ప్రశ్నించే గొంతు లేక ప్రజలు వివిధ రకాలుగా నష్టపోతున్నా రని, హింసించబడుతున్నారని ఆవేదన చెందారు.RGN హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ వారు ప్రజల తరపున నియమ నిబంధనలతో ప్రశ్నించే గొంతుగా మారి వారికి అన్ని రకాలుగా సహకారం అందిస్తూ సమాజ మార్పుకు కృషి చేయాలని సూచించారు.నేడు RGN హ్యూమన్ రైట్స్ & యాంటీ కరప్షన్ అసోసియేషన్ జిల్లా కమిటి బృందం తీసుకునే కార్యక్రమాలకు ఎల్లవేళలా తమవంతు సహకారం అందిస్తామని చెప్పారు.ప్రజా సమస్యల పట్ల నిస్పక్షపాతంగా, నిస్వార్ధంగా పని చేసినపుడే సమాజ సేవకులుగా చిరంజీవులుగా సమాజంలో మన్ననలు పొందుతారని పేర్కొన్నారు. ఎపి ఇంచార్జి విజయ్ కుమార్ మాట్లాడుతూ RGN హ్యూమన్ రైట్స్ & యాంటీ కరప్షన్ అసోసియేషన్ జిల్లా కమిటి నిర్ణయాలకు రాష్ట్ర కమిటీ అండగా నిలుస్తుందన్నారు. నిబద్దతతో ప్రతి ఒక్కరు RGN హ్యూమన్ రైట్స్ & యాంటీ కరప్షన్ అసోసియేషన్ అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం జిల్లా నాయకులు వి.విజయ్ కుమార్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ సత్యనారాయణ,ప్రధాన కార్యదర్శి బి. ఆజాద్ లు మాట్లాడుతూ RGN హ్యూమన్ రైట్స్ & యాంటీ కరప్షన్ అసోసియేషన్ సంస్థ నియమ నిబంధనలతో ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తూ,వారి సమస్యల పరిష్కారం కోసం,ప్రజలను చైతన్యం చేయడం కోసం ఆయా ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలనీ చెప్పారు.  ప్రతి ఒక్కరూ అసోసియేషన్ సంస్థ నిబంధనల మేరకు ఈకార్యక్రమాలు కొనసాగించాలని కోరారు. అనంతరం డిఎస్పీ మహబూబ్ బాషా చేతుల మీదుగా కర్నూలు జిల్లా నూతన కమిటీ సభ్యులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు జి.విజయకుమార్, చిరంజీవి, పాపన్న, నాగేంద్రుడు, పాణ్యం నియోజకవర్గం అధ్యక్షులు చిన్నస్వాములు, ఓర్వకల్ మండలం అధ్యక్షులు కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు 

error: Content is protected !!