V POWER NEWS KURNOOL TOWN: జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి పి. విజయ గారి ఆధ్వర్యంలో DWCW లో భాగమైన వన్ స్టాప్ సెంటర్ ద్వారా 10 రోజుల ప్రత్యేక అవగాహనా కార్యక్రమం లో భాగంగా మొదటి రోజు జిల్లా సూపెరవైజర్స్ మరియు రవీంద్ర డిగ్రీ కాలేజీ స్టూడెంట్స్ దగ్గర అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మిషన్ శక్తి లో ఉన్న హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఉమెన్స్, ఓఎస్సీ సేవలు,శక్తి నివాస్ మరియు శక్తి సదన్ మహిళ హెల్ప్ లైన్, చైల్డ్ హెల్ప్ లైన్ పాలసీ ల గురించి వివరించారు. కార్యక్రమం లో మిషన్ కోఆర్డినేటర్ బాలమణి, మేరీ స్వర్ణలత, సునీత, విజయకుమారి మరియు జోష్టనా ప్రియాంక పాల్గొన్నారు.
