ఆంధ్ర ప్రదేశ్

ఫోటో,వీడియో గ్రాఫర్స్ ఆధ్వర్యంలో ఘనంగా సింధు డిజి ప్రింట్ హౌస్ ప్రారంభం..

V Power News : కర్నూలు నగరంలో శుక్రవారం ఘనంగా మౌర్య ఇన్ దగ్గర్లో ఆర్ఆర్ హాస్పిటల్ లైన్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఎదురుగా ప్రొపెటర్ బోరెల్లి సుధాకర్ మరియు ఫోటోగ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్ ఆధ్వర్యంలో సింధు డిజి ప్రింట్ హౌస్ ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా ప్రొఫైటర్ సుధాకర్ మాట్లాడుతూ సింధు ఫోటో డిజి ప్రింట్ హౌస్ లో ఫోటో ఫ్రేమ్స్, పాంప్లెట్స్, వెడ్డింగ్ కార్డ్స్ ,ఆల్బమ్స్,బైండింగ్ ఫోటోగ్రఫీ ఈవెంట్స్,విసిటింగ్ కార్డ్స్, క్యాలెండర్స్, ఎల్ఈడి ప్రేమ్స్, వీడియోగ్రఫీ డిజైనింగ్ మరియు వీడియో మిక్సింగ్ ఫోటో వీడియో డిజైనింగ్ కొరకు హైదరాబాదు మరియు విజయవాడ వెళ్లవలసిన అవసరం లేకుండా ఇక్కడ అన్ని రకములైన విధంగా నాణ్యమైన క్వాలిటితో తయారు చేయబడు తుందని ఆయన తెలిపారు. ఈ సదా అవకాశంను అందరూ ఉపయోగించుకోవాలని కోరారు.  ఈకార్యక్రమంలో  జయకాంత్ క్రిస్టియన్ .భార్గవాచారి ఫోటో వీడియో గ్రాఫర్స్ ప్రెసిడెంట్, బద్రిప్రసాదు సీనియర్ ఫోటోగ్రాఫర్, రాంభూపాల్ రెడ్డి సీనియర్ ఫోటోగ్రాఫర్, సురేష్ బాబు సీనియర్ డిజైనర్, వడ్ల మధు కుమార్ సీనియర్ డిజైనర్, సిద్దు పవర్ సీనియర్ డిజైనర్, బైరెడ్డి ప్రతాప్ రెడ్డి సీనియర్ ఎడిటర్, కే చంద్రశేఖర్ సీనియర్ ఫోటోగ్రాఫర్, ధర్మాపేట శేఖర్, ఇబ్రహీం నవత స్టూడియ మరియు కుటుంబ సభ్యులు, ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్, పాస్టర్స్, శ్రేయోభిలాషులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

బీసీ,ఎస్సీ,ఎస్టీ హాస్టల్ లో ..  పది రోజుల ప్రత్యేక సంకల్ప ప్రోగ్రాముపై అవగాహనా 

V POWER NEWS  : కర్నూలు జిల్లా, స్త్రి శిశు సంక్షేమ మరియు సాధికారత అధికార విభాగం కింద పని చేయుచున్న వన్ స్టాప్ సెంటర్ ద్వారా సంకల్ప ప్రోగ్రాము పది రోజుల ప్రత్యేక అవగాహనా కార్యక్రమం లో భాగంగా కలెక్టరేట్ దగ్గర ఉన్న బీసీ,ఎస్సీ,ఎస్టీ హాస్టల్ లో ఉన్న ఆడోలిసెంట్ బాలికలకు సానిటరీ నాపకిన్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.విజయ, జయమ్మ , జయమ్మ డిడి, ఐ&పిఆర్ అగ్రికల్చర్ ఆఫీసర్ వరలక్ష్మి  చేతుల మీద ఇవ్వడం జరిగింది. అలాగే పీరియడ్ వచ్చినపుడు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిశుభ్రతను పాటించాలి, పౌష్టికహారాన్ని ఎలా తీసుకోవాలి అనే విషయాలను అవగాహనా కల్పించారు.ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.విజయ ఓఎస్సీ అడ్మిన్ మేరీస్వర్ణలత, జోష్టనా ప్రియాంక, సునీత పాల్గొన్నారు.

16 లక్షల విలువ చేసే 32 ద్విచక్ర వాహనాలు స్వాధీనం .. కర్నూలు DSP బాబు ప్రసాద్

లక్ష్మీనగర్ కు చెందిన  నిరంజన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు .. ద్విచక్ర వాహనాలు దొంగలించే నిందితుడు అరెస్టు .. కర్నూలు డిఎస్పీ  జె. బాబు ప్రసాద్.  V POWER NEWS KURNOOL,  క్రైమ్  : కర్నూలు రెండవ పట్టణ పోలీసులు 16 లక్షల విలువ చేసే 32 ద్విచక్ర వాహనాలు దొంగలించిన నిందితున్ని  శుక్రవారం అరెస్టు చేశారు. ఈ సంధర్బంగా కర్నూలు డిఎస్పీ  జె. బాబు ప్రసాద్,  కర్నూలు టు టౌన్ సిఐ నాగరాజారావు, ఎస్సైలు సతీష్, మల్లికార్జున తో కలిసి  కర్నూలు  రెండవ పట్టణ పోలీసుస్టేషన్ లో నిందితుని వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. కర్నూలు పట్టణంలోని భూపాల్ కాంప్లెక్స్ దగ్గర ఒక బైక్ దొంగలించారని  కర్నూలు, లక్ష్మీనగర్ కు చెందిన  నిరంజన్  ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, కర్నూలు టు టౌన్ సిఐ , ఎస్సైలు, పోలీసు కానిస్టేబుల్స్ రవి కుమార్, శ్రీనివాసులు, మహేంద్రలు కలిసి ఒక  స్పెషల్ టీమ్ గా ఏర్పడి నిందితున్ని పట్టుకోవడాని చర్యలు చేపట్టామని, మాకు రాబడిన సమాచారం మేరకు   కర్నూలు- సుంకేశుల రోడ్డు లో ఉన్న రెండు వాగుల వద్ద శుక్రవారం నాడు , తెలంగాణ రాష్ట్రం, గద్వాల పట్టణం, దౌడురాళ్ళ కాలనీకి చెందిన తెలుగు జయంత్ @జస్వంత్  ను అరెస్టు చేసి, అతని నుండి 32 బైక్ (హోండాషైన్ , హిరో హోండా, యూనికార్న్ ) లను రికవరీ చేయడం జరిగిందని వీటి విలువ రూ. 16 లక్షల వరకు ఉంటుందన్నారు.  

డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్ కె.వి.బాలామని ఆధ్వర్యంలో.. విద్యార్థులకు యాక్ట్ పై అవగాహన

V POWER NEWS : కర్నూలు జిల్లా మహిళా అభివృద్ధి మరియు శ్రీ శిశు సంక్షేమశాఖ, డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్ కె.వి.బాలామని గ పోక్సో యాక్ట్ పై అవగాహన కల్పించారు.అదేవిదంగా వన్ స్టాప్ సెంటర్ సేవలు, యువ సకి పీర్ గ్రూప్ లీడర్స్ యొక్క భాద్యతలనుతెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ పొట్టిశ్రీరాములు స్మారక పాఠశాల బండిమిట్ట ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది పి.ఎఫ్.ఓ.శ్రీనివాసులు,కేస్ వర్కర్ విజయకుమారి, పారామెడికల్ రేష్మా పాల్గొన్నారు

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో.. ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజనపై అవగాహన కార్యక్రమం

V POWER NEWS  : కర్నూలు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి పి. విజయ ఆధ్వర్యంలో లో డిడబ్ల్యూ సీడబ్ల్యూ భాగమైన వన్ స్టాప్ సెంటర్ ద్వారా 10రోజుల ప్రత్యేక అవగాహనా కార్యక్రమం లో భాగంగా 7వ రోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకేషనల్ విద్యార్థులకు ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన పైన అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఐ. విజయకుమారి, ఏఎస్ఐ శ్రీనివాసులు పాల్గొన్నారు.

డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్ కె.వి.బాలామని ఆధ్వర్యంలో .. పోషకాహారం మరియు ఆరోగ్యం పై అవగాహన

V POWER NEWS : కర్నూలు జిల్లా, మహిళా అభివృద్ధి మరియు శ్రీ శిశు సంక్షేమశాఖ, డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్ కె.వి.బాలామని పోషకాహారం మరియు ఆరోగ్యం పై అవగాహన కల్పించారు. అదేవిదంగా వన్ స్టాప్ సెంటర్ సేవలు, యువ సకి పీర్ గ్రూప్ లీడర్స్ యొక్క భాద్యతలను తెలియజేశారు.ఈ కార్యక్రమం లో కేశవ రెడ్డి పాఠశాల కృష్ణానగర్ ఉపాధ్యాయులు, విద్యార్థులు , పి.హెచ్.సి సిబ్బంది మరియు వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది కేస్ వర్కర్ జ్యోత్స్న, పారామెడికల్ రేష్మా పాల్గొన్నారు

సీఎం రిలీఫ్ ఫండ్ … కష్టాల్లో ఉన్న ప్రజలకు కొండంత అండగా నిలుస్తోంది  : నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య

నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గానికి చెందిన 8 మంది లబ్దిదారులకు రూ. 609,644 /- లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య . ఈ సందర్బంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ.. కష్టాల్లో ఉన్న ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ కొండంత అండగా నిలుస్తుందని, ప్రతిఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.   సీఎం రిలీఫ్ ఫండ్ లబ్దిదారుల వివరాలు : వీపనగండ్ల గ్రామం:- (1) జి వెంకటేశ్వర్ రెడ్డి, 86,870/-రూపాయలు, మిడుతూరు గ్రామం:-  (2) కె సత్యనారాయణ 48,333/- రూపాయలు (3) విద్యపోగు రవి  36,337/- రూపాయలు మరియు (4) కటకం సత్యనారాయణ గారికి 1,40000/- రూపాయలు సున్నం పల్లె గ్రామం:- (5) కమతం వెంకటేశ్వరమ్మ గారికి 44,223/-రూపాయలు, తలముడిపి గ్రామం:- (6) కె పెద్ద తిరుపతి  98,470/- రూపాయలు, రోల్లపాడు గ్రామం:- (7) ఉప్పరి బాల గుర్రప్ప కి 30,756/- రూపాయలు, చెరుకు చెర్ల గ్రామం:- (8) గద్దల మణెమ్మ కి 1,24,655/- రూపాయలు, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను, గ్రామాలలో ఉన్న లబ్ధిదారులకు ఇంటి దగ్గరికే వెళ్లి పంపిణీ చేసిన. నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గిత్త జయసూర్య .  ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి, వంగాల శివరామరెడ్డి, కమతం రాజశేఖర్ రెడ్డి, వడ్డే జయరాముడు, స్వామి రెడ్డి, నాగేంద్ర, సర్వోత్తమ్ రెడ్డి, పల్చని మహేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ అధికారులు నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది

మిషన్ శక్తి లో భాగంగా .. బేటి బచావో – బేటి పడావో అవగాహన కార్యక్రమం

రవీంద్ర ఇంగ్లీష్ మీడియo స్కూల్ విద్యార్థులకు మరియు సిబ్బందికి అవగాహన V POWER NEWS  KURNOOL  TOWN  : కర్నూలు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి పి విజయ గారి ఆధ్వర్యంలో 10 రోజుల ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో మిషన్ శక్తి లో భాగమైన బేటి బచావో బేటి పడావో అనే అంశం పైన రవీంద్ర ఇంగ్లీష్ మీడియo స్కూల్ విద్యార్థులకు మరియు సిబ్బందికి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది ఐ విజయ కుమారి వి జోష్ణ కిస్ వర్కర్స్ ఆర్ మౌన wwps,లక్ష్మి ANM  పాల్గొన్నారు.

ఆడపిల్లలను బ్రతికించు, ఆడపిల్లలను చదివించు ప్రాముఖ్యత పై అవగాహనా కార్యక్రమం

స్త్రీ శిశు సంక్షేమ శాఖ & సాధికారత అధికారిణి పి. విజయ ఆదేశాల మేరకుఓ ఎస్ సి సేవలు, 181,1098,1030,112 సైబర్ క్రైమ్ ప అవగాహన కార్యక్రమం. V POWER NEWS KURNOOL TOWN  : కర్నూలు మండలంలోని ఇందిరాగాంధీ నగరపాలక ఉన్నత పాఠశాల ఏ క్యాంపు నందుస్త్రీ శిశు సంక్షేమ శాఖ సంకల్ప ప్రోగ్రాము లో పది రోజుల ప్రత్యేక అవగాహనా కార్యక్రమం నిర్వహించారు అనంతరం శనివారం నాడు ఇందిరాగాంధీ నగరపాలక ఉన్నత పాఠశాల ఏ క్యాంపు నందు స్త్రీ, శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి పి. విజయ ఆదేశాల మేరకు అవగాహనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. ఆడపిల్లలను బ్రతికించు, ఆడపిల్లలను చదివించు అని ఆడపిల్లల పుట్టుక, చదువు యొక్క ప్రాముఖ్యతను మరియు లైంగిక పునరుత్పత్తి, ఆరోగ్యం గురించి తెలియజేసారు. అలాగే ఏ క్యాంపు లో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ నందు ఆశ వాళ్లతో అవగాహనా కార్యక్రమంలో ఓ ఎస్ సి సేవలు, 181,1098,1030,112 సైబర్ క్రైమ్ గురించి తెలియజేసారు. కార్యక్రమం లో వన్ స్టాప్ సెంటర్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్, కేసు వర్కర్ v. జోష్టనా, ఏ ఎస్ ఐ జి. శ్రీనివాసులు పాల్గొన్నారు.

APRSA ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

V power news  : కర్నూలు నగరంలో..  మంగళవారం నాడు కర్నూలు రూరల్ మండలము తహసీల్దారు టి.వి. రమేష్ బాబు  అధ్యక్షతన APRSA (Andhra Pradesh Revenue Servicess Association) కర్నూలు డివిజన్ వారు మాజీ కర్ణము (గ్రామ రెవిన్యూ మునిసిబ్) & కర్నూలు గ్రందాలయము మాజీ చైర్మన్ గంగాధర రెడ్డి సహకారముతో బుధవార పేటలోని సుశీల నేత్రాలయము డాక్టర్  సుధాకర్  వారి సిబ్బంది, కర్నూలు కొత్త బస్టాండ్ సమీపములోని మేడికోవర్ ఆసుపత్రి డాక్టర్లు మరియు వారి సిబ్బంది, కర్నూలు శకుంతల కళామందిర్ సమీపములోని ఎస్.జె హాస్పిటల్ డాక్టర్లు మరియు వారి సిబ్బంది Roja’s Speech & Rehabitation Center హాస్పిటల్ (వినికిడి సమస్యలు) డాక్టర్లు మరియు వారి సిబ్బందితో ఉచిత మెగా వైద్య శిభిరం నిర్వహించడము జరిగినది.  ఈ మెగా వ్యైదశిభిరం నకు ముఖ్య అతిధిగా కర్నూలు రెవిన్యూ డివిజన్ అధికారి K. సందీప్ కుమార్ వారు పాల్గొని, ప్రారంభం చేయడం జరిగినది. ఇందులో కర్నూలు రూరల్ తహసీల్దారు రమేష్ బాబు, APRSA  నాయకులు  సి.నాగరాజు, లక్ష్మి రాజు,  వి.రామాంజనేయులు,  వేణుగోపాల్ రావు, లోకేశ్వర రెడ్డి, వెంకట రాజు, కల్లూరు తహసీల్దారు కే.ఆంజనేయులు, సి.బెళగల్ తహసీల్దారు శ్రీమతి వెంకట లక్ష్మి, KRRC తహసీల్దారు కుమారస్వామి, రిటైర్డ్ తహసీల్దారు మల్లికార్జున స్వామి మరియు డిప్యూటీ తహసీల్దారు లు ఆర్. విష్ణు ప్రసాద్, పురుషోత్తముడు, జాకీర్ హుస్సేన్ తదితర అన్ని స్థాయిల రెవిన్యూ సిబ్బంది ఈ శిభిరం లో పాల్గొనడము జరిగినది. ఈ సందర్భంగా కంటి చూపుకు సంబంధించి – 170 మందికి, పంటికి (డెంటల్) సంబంధించి – 65 మందికి, ECG – 50 మందికి, వినికిడి సమస్యలు – 70 మందికి & BP, Sugar వ్యాధికి సంబంధించి -135 మందికి పరీక్షలు నిర్వహించడము జరిగినది. అలాగే ఇందులో వినికిడి సమస్యతో భాదపడుతున కర్నూలు రూరల్ తహసీల్దారు కార్యాలయం ఉద్యోగి ఐన శ్రీ అయ్యన్నకు ఉచితంగా వినికిడి యంత్రం ను కూడా Roja’s Speech & Rehabitation Hospital వారు అందజేస్తాము అని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అలాగే కంటి చూపు లోపించిన 24 మంది ఉద్యోగులకు ఉచితముగా గ్రందాలయము మాజీ చైర్మన్  గంగాధర రెడ్డి కంటి అద్దాలు వచ్చే మంగళవారం నాడు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇందులో పాల్గొన్న  వ్యక్తులoదరూ రెవిన్యూ ఉద్యోగుల యొక్క వ్యయ ప్రయాసల గురించి ప్రసంగించారు. ఇలాంటి వైద్య శిబిరాలు ఇంకా ఎన్నో నిర్వహించాలని  APRSA  వి. రామాంజనేయులు అధ్యక్షులు పలువురు అభిప్రాయం వ్యక్తము చేశారు.                                                                                            

error: Content is protected !!