V power news : కర్నూలు నగరంలో.. మంగళవారం నాడు కర్నూలు రూరల్ మండలము తహసీల్దారు టి.వి. రమేష్ బాబు అధ్యక్షతన APRSA (Andhra Pradesh Revenue Servicess Association) కర్నూలు డివిజన్ వారు మాజీ కర్ణము (గ్రామ రెవిన్యూ మునిసిబ్) & కర్నూలు గ్రందాలయము మాజీ చైర్మన్ గంగాధర రెడ్డి సహకారముతో బుధవార పేటలోని సుశీల నేత్రాలయము డాక్టర్ సుధాకర్ వారి సిబ్బంది, కర్నూలు కొత్త బస్టాండ్ సమీపములోని మేడికోవర్ ఆసుపత్రి డాక్టర్లు మరియు వారి సిబ్బంది, కర్నూలు శకుంతల కళామందిర్ సమీపములోని ఎస్.జె హాస్పిటల్ డాక్టర్లు మరియు వారి సిబ్బంది Roja’s Speech & Rehabitation Center హాస్పిటల్ (వినికిడి సమస్యలు) డాక్టర్లు మరియు వారి సిబ్బందితో ఉచిత మెగా వైద్య శిభిరం నిర్వహించడము జరిగినది.


ఈ మెగా వ్యైదశిభిరం నకు ముఖ్య అతిధిగా కర్నూలు రెవిన్యూ డివిజన్ అధికారి K. సందీప్ కుమార్ వారు పాల్గొని, ప్రారంభం చేయడం జరిగినది. ఇందులో కర్నూలు రూరల్ తహసీల్దారు రమేష్ బాబు, APRSA నాయకులు సి.నాగరాజు, లక్ష్మి రాజు, వి.రామాంజనేయులు, వేణుగోపాల్ రావు, లోకేశ్వర రెడ్డి, వెంకట రాజు, కల్లూరు తహసీల్దారు కే.ఆంజనేయులు, సి.బెళగల్ తహసీల్దారు శ్రీమతి వెంకట లక్ష్మి, KRRC తహసీల్దారు కుమారస్వామి, రిటైర్డ్ తహసీల్దారు మల్లికార్జున స్వామి మరియు డిప్యూటీ తహసీల్దారు లు ఆర్. విష్ణు ప్రసాద్, పురుషోత్తముడు, జాకీర్ హుస్సేన్ తదితర అన్ని స్థాయిల రెవిన్యూ సిబ్బంది ఈ శిభిరం లో పాల్గొనడము జరిగినది. ఈ సందర్భంగా కంటి చూపుకు సంబంధించి – 170 మందికి, పంటికి (డెంటల్) సంబంధించి – 65 మందికి, ECG – 50 మందికి, వినికిడి సమస్యలు – 70 మందికి & BP, Sugar వ్యాధికి సంబంధించి -135 మందికి పరీక్షలు నిర్వహించడము జరిగినది. అలాగే ఇందులో వినికిడి సమస్యతో భాదపడుతున కర్నూలు రూరల్ తహసీల్దారు కార్యాలయం ఉద్యోగి ఐన శ్రీ అయ్యన్నకు ఉచితంగా వినికిడి యంత్రం ను కూడా Roja’s Speech & Rehabitation Hospital వారు అందజేస్తాము అని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అలాగే కంటి చూపు లోపించిన 24 మంది ఉద్యోగులకు ఉచితముగా గ్రందాలయము మాజీ చైర్మన్ గంగాధర రెడ్డి కంటి అద్దాలు వచ్చే మంగళవారం నాడు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇందులో పాల్గొన్న వ్యక్తులoదరూ రెవిన్యూ ఉద్యోగుల యొక్క వ్యయ ప్రయాసల గురించి ప్రసంగించారు. ఇలాంటి వైద్య శిబిరాలు ఇంకా ఎన్నో నిర్వహించాలని APRSA వి. రామాంజనేయులు అధ్యక్షులు పలువురు అభిప్రాయం వ్యక్తము చేశారు.