
V POWER NEWS: కర్నూలు జిల్లా యువజన సంక్షెమ శాఖ సెట్కూరు ఆధ్వర్యంలో జరిగే జిల్లా స్థాయి యువజన ఉత్సవాల పోస్టర్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్. ఎ. సిరి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ యువజన ఉత్సవాలలో యువత ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.15-29 లలోపు యువ కళాకారులకు 22.10.2025 వ తేదీన కర్నూలు లోని రవీంద్ర మహిళా ఇంజనీరింగ్ కళాశాల, లో జిల్లా స్థాయి యువజనోత్సవ పోటీలు ఏడు విభాగలలో జరుతాయాని, జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన విజేతలు రాష్ట్రస్థాయి మొదటి స్థానంలో నిలిచిన విజేతలు జాతీయ స్థాయికి పంపబడుతారని తెలిపారు. విజేతలకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు మరియు పాల్గొన్న కళాకారులకు పార్టిసిపేషన్ సెర్టిఫికేట్లు అందజేయబడుతాయాన్నారు.సెట్కూరు సీఈఓ డాక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ పోటీలలో పాల్గొనదలచిన యువతీ యువకులు, కళాకారులు తమ పేరు లేక బృందం పేరును వెబ్ లింక్ https://bit.ly/knldyf25 ద్వారా నమోదు చేసుకోవాలని కోరారు. ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసుకోవడానికి వీలుకాని వారు నేరుగా 22.10.2025 నాడు ఉదయం 09.00 గంటల లోపు వచ్చి నమోదు చేసుకొనవచ్చునని తెలిపారు. ఇతర వివరములకు మొబైల్ నెంబర్ 92922 07601 కు ఫోన్ చేసి సంప్రదించగలరని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇంటర్ మీడియట్ ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి లాలెప్ప, కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి శివ రాముడు, సెట్కూరు పర్యవేక్షణ అధికారి శ్యామ్ బాబు పాల్గొన్నారు.


