LHPS రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాస్ నాయక్
V POWER NEWS : లంబాడి హక్కుల పోరాట సమితి కార్యాలయం విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాస్ నాయక్ మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా 15 కోట్ల జనాభా కలిగిన లంబాడి బంజారా తెగలకు సంబంధించిన వారు దేశవ్యాప్తంగా ఒకే సంస్కృతి ఒకె సాంప్రదాయాలు పాటిస్తూ దేశవ్యాప్తంగా ఒకే భాషని మాట్లాడుతూ జీవిస్తున్న బంజారా జాతి కులదైవం ఆరాధ్యుడు జాతి ప్రజలు అందరూ మంచి మార్గంలో నడవాలని భారతదేశమంతా కూడా నడిచి తన సందేశాన్ని బంజారా జాతి తో పాటు ఇతర జాతుల వారిని కూడా చైతన్యపరిచినటువంటి మార్గదర్శకుడు శాంతి స్వరూపుడు అహింస వాది నేటికీ ప్రతి రాష్ట్రంలో ఫిబ్రవరి 14,15 తేదీలలో శ్రీ సేవాలాల్ మహారాజ్ పుట్టినరోజు అధికారికంగా జరుపుతున్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్లో అధికారికంగా జరపకపోవడం చాలా బాధాకరమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12 లక్షల పైబడి జనాభా గలిగిన లంబాడీల మనోభావాలు దెబ్బతీయడమే నని అన్నారు ఈ సందర్భంగా నేడు రాష్ట్ర ప్రభుత్వం వడ్డే ఓబన్న, త్రిపురనేని రామస్వామి చౌదరి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి , పుట్టపర్తి నారాయణచార్యుల, బాబు జగజీవన్ రామ్, మహాత్మ జ్యోతిరావు పూలే , డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, అల్లూరి సీతారామరాజు, మహర్షి వాల్మీకి జయంతి ఇలా ప్రముఖుల జయంతుల్ని వర్ధంతులను ఆంధ్ర రాష్ట్ర కూటమి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీసీ సంక్షేమ యువజన సర్వీసులు దేవాదాయ శాఖ సాంఘిక సంక్షేమ శాఖ మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయాలకు ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం. ఆంధ్ర రాష్ట్రంలో 12 లక్షల పైబడిన జనాభా కలిగి 40 నియోజకవర్గాలలో ఓటు శాతం ఉన్న గిరిజన లంబాడీల ఆరాధ్య దైవం అయినటువంటి శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ని కూడా రాష్ట్ర కూటమి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్య్రమంలో ఎస్ నాగరాజు నాయక్, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి దేవావత్ శంకర్ నాయక్ మరియు తదితరులు ఉన్నారు.