మాల మహాసభ రాష్ట్ర అధ్యక్షులు, జేఏసీ కన్వీనర్ యాట. ఓబులేష్, …రాయలసీమ మాలల యుద్ధ గర్జన ను జయప్రదం చేయండి … స్థానిక ఎస్వి ఎస్వి రెసిడెన్సి నందు మల్లెల వెంకటరావు
మాల మహాసభ రాష్ట్ర అధ్యక్షులు, జేఏసీ కన్వీనర్ యాట.ఓబులేష్, గౌరవ అధ్యక్షులు మాధవ్ స్వామి , గోన నాగరాజు, జ్యోతి , మల్లెల వెంకటరావు మాaట్లాడుతూ మా పోరాటము మాదిగలకు వ్యతిరేకం కాదు మా పోరాటము ప్రభుత్వాలకు వ్యతిరేకం, ఎస్సీ వర్గీకరణ అనేది రాజ్యాంగ బద్ధమైనది కాదు, దేశంలో ఎస్సీ ఉప కులాలు చాలా ఉన్నాయి. ఈ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే వర్గీకరణ చేయాలని ప్రభుత్వాలు మాలలు నష్టపరిచే విధంగా కుట్రపూరితమైన ఆలోచనతో తక్కువ చేసి రిజర్వేషన్లు తక్కువ కల్పించి, విద్యాపరంగా రానీయకుండా అడ్డుపడుతున్నారు. ఉద్యోగాల్లో రాణియకూడదని కుట్ర చేస్తున్నారు.మా పోరాటం మాదిగలకు వ్యతిరేకం కాదు మా పోరాటం ప్రభుత్వాలను వ్యతిరేకం, వర్గీకరణ రాజ్యాంగపరమైన చట్టబద్ధతతో చేయాలనేది మా యొక్క డిమాండు, అందులో భాగమే కర్నూల్లో జరగబోయే రాయలసీమ మాలల యుద్ధ గర్జన సభను జయప్రదం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వడ్డేపల్లి మాధవస్వామి, మాల మహానాడు నాయకులు మాధవస్వామి, వేల్పుల జ్యోతి, శివ శంకర్, కేదార్నాథ్, లక్ష్మయ్య, బండి సుధీర్, మాదాసు నాగరాజు,ప్రసాదు యోగి, బంగి స్వాములు, రవిరాజు, జాన్, శ్యామ్ ఇమ్మానుయేలు, నవీను, శ్రీనివాసులు, దండగేరి లక్ష్మన్న, శివ, బిసన్న తదితరులు పాల్గొన్నారు.