ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు అయ్యేలా చూడాలి.. జిల్లా కలెక్టర్ సిరి

ప్రజల సమస్యల పరిష్కారంలో జిల్లాను మొదటి స్థానంలో నిలపాలి ...  జిల్లాలో ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించినా ..కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి .

 

V POWER NEWS  : కర్నూలు, కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో   3 రోజుల పాటు  91 శాఖల అధికారులతో    ఇంటరాక్టివ్ సెషన్ కార్యక్రమాన్ని నిర్వహించడంలో భాగంగా శని వారం మూడవ రోజు  రెవెన్యూ, విద్య, వైద్య ఆరోగ్యం, కమర్షియల్ ట్యాక్స్, ఐసిడిఎస్ తదితర  శాఖల అధికారులతో జిల్లా    కలెక్టర్ ఇంటరాక్టివ్  సెషన్ కార్యక్రమం నిర్వహించారు.వివిధ శాఖల జిల్లా అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా తమ శాఖ కార్యక్రమాలను గురించి వివరించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో  జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందించాల్సిన సేవలన్నీ సక్రమంగా అందించాలన్నారు.. అలాగే ప్రజల సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించాలన్నారు..ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారి సమస్యలను ఓపిగ్గా వినాలని సూచించారు. సమస్యల పరిష్కారంలో జిల్లాను మొదటి స్థానంలో నిలపాలని, అలాగే ఐవీఆర్ఎస్ ద్వారా వచ్చే ప్రజాభిప్రాయ సేకరణ కూడా సానుకూలంగా ఉండేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో  డిఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ, సిపిఓ భారతి, హౌసింగ్ పిడి చిరంజీవి, డిఎంహెచ్వో డా. భాస్కర్, హాస్పిటల్ సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వర్లు,  ఐసిడిఎస్ పిడి విజయ, కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ నీరజ,డిఇఓ శామ్యూల్ పాల్, ఆర్టీసీ ఆర్ ఎం శ్రీనివాసులు, ఇతర శాఖల  జిల్లా అధికారులు పాల్గొన్నారు..
ఈ సమావేశంలో  డిఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ, సిపిఓ భారతి, హౌసింగ్ పిడి చిరంజీవి, డిఎంహెచ్వో డా. భాస్కర్, హాస్పిటల్ సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వర్లు,  ఐసిడిఎస్ పిడి విజయ, కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ నీరజ,డిఇఓ శామ్యూల్ పాల్, ఆర్టీసీ ఆర్ ఎం శ్రీనివాసులు, ఇతర శాఖల  జిల్లా అధికారులు పాల్గొన్నారు..
 
Share the content

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!