ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తూంది..

V POWER NEWS : కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామానికి చెందిన దుంపల నాగేష్ కి ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం కింద అందిన ఆర్ధిక సహాయాన్ని ఎంపీ తన కార్యాలయంలో అందజేశారు. దుంపల నాగేష్ ఆరోగ్య సమస్యలతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు.. అనంతరం వైద్య ఖర్చుల సహాయం కోసం ఎంపీ నాగరాజు ని సంప్రదించి సీఎం రీలీఫ్ ఫండ్ కి దరఖాస్తు చేసుకోగా రూ.59,879మంజూరు అయ్యాయి.సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్ధిక సహాయం అందేందుకు సహకారం అందించిన ఎంపీ కి లబ్దిదారుడు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా ఎంపీ నాగరాజు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రి సహాయనిధిని అందిస్తున్నట్లు తెలిపారు.


