V POWER NEWS : కర్నూలు జిల్లా, స్త్రి శిశు సంక్షేమ మరియు సాధికారత అధికార విభాగం కింద పని చేయుచున్న వన్ స్టాప్ సెంటర్ ద్వారా సంకల్ప ప్రోగ్రాము పది రోజుల ప్రత్యేక అవగాహనా కార్యక్రమం లో భాగంగా కలెక్టరేట్ దగ్గర ఉన్న బీసీ,ఎస్సీ,ఎస్టీ హాస్టల్ లో ఉన్న ఆడోలిసెంట్ బాలికలకు సానిటరీ నాపకిన్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.విజయ, జయమ్మ , జయమ్మ డిడి, ఐ&పిఆర్ అగ్రికల్చర్ ఆఫీసర్ వరలక్ష్మి చేతుల మీద ఇవ్వడం జరిగింది. అలాగే పీరియడ్ వచ్చినపుడు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిశుభ్రతను పాటించాలి, పౌష్టికహారాన్ని ఎలా తీసుకోవాలి అనే విషయాలను అవగాహనా కల్పించారు.ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.విజయ ఓఎస్సీ అడ్మిన్ మేరీస్వర్ణలత, జోష్టనా ప్రియాంక, సునీత పాల్గొన్నారు.

