స్త్రీ శిశు సంక్షేమ శాఖ & సాధికారత అధికారిణి పి. విజయ ఆదేశాల మేరకుఓ ఎస్ సి సేవలు, 181,1098,1030,112 సైబర్ క్రైమ్ ప అవగాహన కార్యక్రమం.
V POWER NEWS KURNOOL TOWN : కర్నూలు మండలంలోని ఇందిరాగాంధీ నగరపాలక ఉన్నత పాఠశాల ఏ క్యాంపు నందుస్త్రీ శిశు సంక్షేమ శాఖ సంకల్ప ప్రోగ్రాము లో పది రోజుల ప్రత్యేక అవగాహనా కార్యక్రమం నిర్వహించారు అనంతరం శనివారం నాడు ఇందిరాగాంధీ నగరపాలక ఉన్నత పాఠశాల ఏ క్యాంపు నందు స్త్రీ, శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి పి. విజయ ఆదేశాల మేరకు అవగాహనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. ఆడపిల్లలను బ్రతికించు, ఆడపిల్లలను చదివించు అని ఆడపిల్లల పుట్టుక, చదువు యొక్క ప్రాముఖ్యతను మరియు లైంగిక పునరుత్పత్తి, ఆరోగ్యం గురించి తెలియజేసారు. అలాగే ఏ క్యాంపు లో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ నందు ఆశ వాళ్లతో అవగాహనా కార్యక్రమంలో ఓ ఎస్ సి సేవలు, 181,1098,1030,112 సైబర్ క్రైమ్ గురించి తెలియజేసారు. కార్యక్రమం లో వన్ స్టాప్ సెంటర్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్, కేసు వర్కర్ v. జోష్టనా, ఏ ఎస్ ఐ జి. శ్రీనివాసులు పాల్గొన్నారు.
