ప్రతి ఒక్కరు మట్టి వినాయకులను ప్రతిష్టించేలా కృషి చేయాలి..

సమస్యల పరిష్కారానికి ఆత్మ విశ్వాసంతో మహాదేవుణ్ణి ప్రార్టించుకోవాలి.. కర్నూలు రూరల్ తహసీల్దార్ టి.రమేష్ బాబు, లక్ష్మీనారాయణ ఏపీ టూరిజం డివిజనల్ మేనేజర్

V POWER NEWS’  KURNOOL TOWN :    సమస్యల పరిష్కారానికి ఆత్మ విశ్వాసంతో మహాదేవుణ్ణి ప్రార్టించుకోవాలని కర్నూలు రూరల్ తహసీల్దార్ టి.రమేష్ బాబు సూచించారు.సోమవారం కర్నూలు నగరం,జిల్లా కలెక్టర్ కార్యాలయం, సమాచార శాఖ భవన్ ప్రాంగణంలో పాత్రికేయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పాత్రికేయ వినాయకుణ్ణి ప్రతిష్టించి,నేటికి ఆరవ రోజుకు చేరుకున్నాయి.

ఈ నేపథ్యంలో ఆరవ రోజు పూజలకు కర్నూలు రూరల్ తహసీల్దార్ టి.రమేష్ బాబు,ఉమ్మడి ఎపి టూరిజం అధికారి లక్ష్మి నారాయణ,సిటీ కేబుల్ మహేష్, శ్రీ చక్ర దిన పత్రిక ఎడిటర్ హరినాధ రెడ్డిలు దర్శించుకుని,ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్బంగా తహసీల్దార్ టి.రమేష్ బాబు మాట్లాడుతూ పాత్రికేయులు సైతం పర్యావరణం కాపాడుటలో కృషి చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. వినాయక చవితిని పురస్కరించుకొని మట్టి వినాయకున్ని ప్రతిష్టించడమే కాకుండా దాతల సహకారంతో ఉదయం, సాయంత్రం అల్పాహారం మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమాలు జరపడం అభినందనీయం అని కొనియాడారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరు మట్టి వినాయకులను ప్రతిష్టించేలా కృషి చేయాలనీ వారు పిలుపునిచ్చారు. అనంతరం వారికీ పాత్రికేయ ఉత్సవ కమిటీ బృందం శాలువా మోమేంటోలతో ఘనంగా సన్మానం చేశారు.తదనంతరం ఆల్ఫాహారం వడ్డించారు.ఈ కార్యక్రమం లో కమిటీ బృందం శ్రీనివాసులు, విద్యాసాగర్, మంజునాద్, రామకృష్ణ, జి.విజయ్ కుమార్,అవినాష్,మోహన్,వి. విజయ్ కుమార్, అంజి, కిషోర్, ఇతర పాత్రికేయులు,భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Share the content

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!