V POWER NEWS : కర్నూలు జిల్లా, కోడుమూరు నియోజకవర్గంలో సెప్టెంబర్ రెండో తేదీన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ a పుట్టినరోజు సందర్భంగా కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం సి. బెలగల్ మండల కేంద్రంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు సంధ్యా విక్రమ్ కుమార్ చెప్పారు. అన్ని దానాల కంటే రక్తదానం గొప్పది కాబట్టి మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ఇష్టమైన సామాజిక సేవ కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్క జనసేన నాయకుడు, కార్యకర్త హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. కోడుమూరు నియోజకవర్గంలో ప్రతి జనసేన సైనికుడు ,కార్యకర్త, ప్రజలందరూ కలిసికట్టుగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి పవన్ కళ్యాణ్ గారికి బహుమతిగా ఇస్తామని సంధ్య విక్రమ్ కుమార్ కోరారు. అలాగే రానున్న రోజులు జనసేన పార్టీని బలోపేతం చేయాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన కార్యకర్తలు నాయకులు హాజరయ్యారు.