సమాజంలో జరుగుతున్న లోపాలను ప్రశ్నించడమే మనిషి హక్కు..
కర్నూలు జిల్లా,కల్లూరు మండలం శుక్రవారం నాడు ఎంపీడిఓ కార్యాలయం బిసి స్టడీ సర్కిల్ లో RGN హ్యూమన్ రైట్స్ & యాంటీ కరప్షన్ అసోసియేషన్ జిల్లా కమిటి ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బి.ఆజాద్,జిల్లా ఉపాధ్యక్షులు పరమేష్ అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశా నికి స్పెషల్ పోలీస్ డిఎస్పీ మహబూబ్ బాషా,ఎపి ఇంచార్జి జి.విజయ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సత్యనారాయణ, యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం జిల్లా నాయ కులు విజయ్ కుమార్ హాజరయ్యారు.


ఈ సందర్బంగా స్పెషల్ పోలీస్ డిఎస్పీ మహబూబ్ బాషా మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న లోపాల పట్ల ప్రశ్నించే స్థాయికి యువత అవగాహన పెంచాకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రశ్నించినపుడే సమస్యకు న్యాయం జరుగుతుంది అన్నారు.ప్రస్తుతం సమాజంలో ప్రశ్నించే గొంతు లేక ప్రజలు వివిధ రకాలుగా నష్టపోతున్నా రని, హింసించబడుతున్నారని ఆవేదన చెందారు.RGN హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ వారు ప్రజల తరపున నియమ నిబంధనలతో ప్రశ్నించే గొంతుగా మారి వారికి అన్ని రకాలుగా సహకారం అందిస్తూ సమాజ మార్పుకు కృషి చేయాలని సూచించారు.నేడు RGN హ్యూమన్ రైట్స్ & యాంటీ కరప్షన్ అసోసియేషన్ జిల్లా కమిటి బృందం తీసుకునే కార్యక్రమాలకు ఎల్లవేళలా తమవంతు సహకారం అందిస్తామని చెప్పారు.ప్రజా సమస్యల పట్ల నిస్పక్షపాతంగా, నిస్వార్ధంగా పని చేసినపుడే సమాజ సేవకులుగా చిరంజీవులుగా సమాజంలో మన్ననలు పొందుతారని పేర్కొన్నారు. ఎపి ఇంచార్జి విజయ్ కుమార్ మాట్లాడుతూ RGN హ్యూమన్ రైట్స్ & యాంటీ కరప్షన్ అసోసియేషన్ జిల్లా కమిటి నిర్ణయాలకు రాష్ట్ర కమిటీ అండగా నిలుస్తుందన్నారు. నిబద్దతతో ప్రతి ఒక్కరు RGN హ్యూమన్ రైట్స్ & యాంటీ కరప్షన్ అసోసియేషన్ అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం జిల్లా నాయకులు వి.విజయ్ కుమార్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ సత్యనారాయణ,ప్రధాన కార్యదర్శి బి. ఆజాద్ లు మాట్లాడుతూ RGN హ్యూమన్ రైట్స్ & యాంటీ కరప్షన్ అసోసియేషన్ సంస్థ నియమ నిబంధనలతో ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తూ,వారి సమస్యల పరిష్కారం కోసం,ప్రజలను చైతన్యం చేయడం కోసం ఆయా ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలనీ చెప్పారు. ప్రతి ఒక్కరూ అసోసియేషన్ సంస్థ నిబంధనల మేరకు ఈకార్యక్రమాలు కొనసాగించాలని కోరారు. అనంతరం డిఎస్పీ మహబూబ్ బాషా చేతుల మీదుగా కర్నూలు జిల్లా నూతన కమిటీ సభ్యులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు.


ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు జి.విజయకుమార్, చిరంజీవి, పాపన్న, నాగేంద్రుడు, పాణ్యం నియోజకవర్గం అధ్యక్షులు చిన్నస్వాములు, ఓర్వకల్ మండలం అధ్యక్షులు కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు