కర్నూలు జిల్లా,ఆస్పరి మండలం, చిగిలిలో ఆరుగురు చిన్నారుల మృతి చెందడంపై ఆర్ జి ఎన్ హ్యూమన్ రైట్స్ & అసోసియేషన్ జిల్లా కమిటీ బృందం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.ఈ మేరకు గురువారం ఆర్ జి ఎన్ హ్యూమన్ రైట్స్ & అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ జి.విజయ్ కుమార్, కర్నూలు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ నీలం సత్యనారాయణ,జిల్లా ప్రధాన కార్యదర్శి బి.ఆజాద్ లు మాట్లాడుతూ ఐదవ తరగతి చదువుతున్న శశికుమార్,కిన్నెర సాయి,సాయి కిరణ్,భీమా,వీరేంద్ర, మహబూబ్ అనే ఆరుగురు విద్యార్థులు ఆడుకుంటూ నీటికుంటలో పడి మరణించడంపై విచారం వ్యక్తం చేశారు.ఎంతో భవిష్యత్ ఉన్న చిన్నారుల మృతి వారి కుటుంబాలకు తీరని కడుపుకోతను మిగిల్చిందన్నారు.ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.తక్షణమే ప్రభుత్వం మృతి చెందిన కుటుంబాలకు భరోసా కల్పించి,అర్ధకంగా ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.