V POWER NEWS : ఢిల్లీలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మరియు సహచర టిడిపి ఎంపీలతో కలిసి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు..
ఈ సందర్బంగా విద్యావ్యవస్థలో చేపట్టిన సంస్కరణలు, తీసుకురావాల్సిన మార్పులపై చర్చించడంతో పాటు జులై 5న ఏపీలో నిర్వహించే మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కి ఆహ్వానించారు. అనంతరం ఆగస్టులో విద్యా శాఖ మంత్రుల కాంక్లేవ్ ఏర్పాటు కు ఆంధ్రప్రదేశ్ కు అవకాశం కలిపించిన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు…