V POWER NEWS : సామరస్యంగా భూ సమస్యలను పరిష్కరించుకోవాలని పత్తికొండ ఆర్డిఓ భరత్ నాయక్ పేర్కొన్నారు. మంగళవారం హలహర్వి మండలం కామినహల్ గ్రామంలో పర్యటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొలంలో ఏమైనా కొలతలు తేడాలు, భూసమస్యలు ఉంటే నేరుగా అధికార సమక్షంలోనే పరిష్కరించుకోవాలని సూచించారు. మండల రెవెన్యూ అధికారులు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలను అందించాలని సూచించారు. ఈ సందర్భంగా కామినహల్ గ్రామానికి చెందిన రైతు మహిళ ఆర్ లక్ష్మి దేవి మాట్లాడుతూ సర్వేనెంబర్ 277,278 నాలుగు ఎకరాల పొలంలో సాగులో ఉన్నాం ఆన్లైన్లో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ నజ్మభాను, డిప్యూటీ తాహాశీల్దార్ జి.లక్ష్మి, ఆర్ ఐ మహేష్ గౌడ్, సర్వేర్ దేవేంద్ర స్వామి, వీరాంజనేయులు, జనార్ధన, విఆర్ఓలు, విఆర్ఏలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.