చాగలమర్రి యువజన సంఘం నూతన అధ్యక్షుడిగా తొమ్మండ్రు వినోద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నిక.

V POWER  NEWS  :  నంద్యాల జిల్లా మండల కేంద్రమైన చాగలమర్రి గ్రామంలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి కరుణా కటాక్షలతో శ్రీ వాసవి యువజన సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా తొమ్మండ్రు వినోద్ కుమార్ ఎన్నికయ్యారు.ఆయనకి యువజన సంఘం సభ్యులందరూ పూలదండ వేసి శాలువ కప్పి కృతజ్ఞతలు తెలియజేశారు.గతంలో చెప్పినట్టుగానే అయప్ప స్వామి దేవస్థాన ఆలయ ఆవరణంలో రేకుల షెడ్డుకు గాను విరాళము అందించిన తొమ్మండ్రు వినయ్ కుమార్ కు ఆర్యవైశ్య సంఘం , యువజన సంఘం ఆధ్వర్యంలో పూలమాల వేసి శాలువ కప్పి ధన్యవాదాలు తెలియజేశారు. అదే విధంగా 2025వ సంవత్సరంలో వాసవి యువజన సంఘం నూతన కమిటీ అధ్యక్షుడిగా తొమ్మండ్రు వినోద్ కుమార్ , ఉపాధ్యక్షులు : కామిషెట్టి మధుసూధన్ రావు , బచ్చు సుగుణాకర్ , కార్యదర్శి : బింగుమళ్ళ హరికృష్ణ , ఉప-కార్యదర్షులు : తలుపుల సునిల్ కుమార్ , వల్లంకొండు సాయి సుదర్శన్ రావు, వందవాసీ శివసుబ్బ చక్రధర్ , కోశాధికారి : లింగం రంగనాథ్ , ఉప-కోశాధికారి : కామిషెట్టి సుబ్రమణ్యం కార్యవర్గ సభ్యులు : బైసాని వెంకటేశ్వర్లు , బింగుమళ్ళ సందీప్ , గంగిశెట్టి వాసుదేవయ్య , కామిశెట్టి ప్రసాద్ , మేడ నరేంద్ర , అయినాల శ్రీనివాసులు , మద్దాల సుబ్రమణ్యం , చాటకొండు దుర్గ ప్రసాద్ గార్లను నియమించి నూతన కార్యవర్గంగా ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి యువజన సంఘం అధ్యక్షుడు తొమ్మండ్రు వినోద్ కుమార్ , కమిటీ సభ్యులు , అవోపా అధ్యక్షుడు సుంకు రాజేష్ , కమిటీ సభ్యులు , తదితరులు పాల్గొన్నారు.

Share the content

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!