V POWER NEWS : మంత్రాలయం రూరల్/కోసిగి : కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం ప్రకటిస్తే..కొంతమంది అక్రమార్కులు దానికి తూట్లు పొడుస్తున్నారు..కోసిగి మండల పరిధిలోని అగసనూరు గ్రామం వద్ద తుంగభద్ర నదిలో ఆంధ్ర గడ్డ వైపు కర్ణాటక రాష్ట్రంలో తమాపూర్ గ్రామానికి చెందిన కొంత మంది వ్యక్తులు ఇసుక మాఫియా రెచ్చిపోతుంది..పదుల సంఖ్యలలో ట్రాక్టర్ లతో యదేచ్ఛగా ఇసుకను నిలువ చేస్తూ పక్క రాష్ట్రానికి అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటుంది.అగసనూరు గ్రామానికి చెందిన వ్యక్తులు ఇలా అక్రమంగా ఇసుక తరలిస్తే రాబోయే తరానికి ఇసుక అనేది ఉండకుండా పోతుందని వారిని ఆపడానికి ట్రై చేస్తున్నా అవడం లేదు..అక్రమంగా ఇసుకను పట్టపగలే గ్రామ సమీపంలోని తుంగభద్ర నదిలో గట్టు వద్ద గుట్టాలుగా నిల్వచేస్తున్నారు..అనంతరం రాత్రి వేళలో అక్రమ రవాణాకు పూనుకుంటున్నారు.


ఒక్క ట్రిప్పు రూ.30 వేల వరకు విక్రయిస్తున్నట్టు సమాచారం..ఇప్పటికైనా రెవెన్యూ,పోలీస్ అధికారులు ఇసుక అక్రమ నిల్వలను గుర్తించి మాఫియా పై చర్యులుa తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు..