మహిళల భద్రత పై ప్రత్యేక దృష్టి సారించాలి. .. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి.
V POWER NEWS … KURNOOL : పోలీసు అధికారులు, పోలీసులు మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. ఈ మేరకు కర్నూలు జిల్లా కేంద్రంలోని మూడో పట్టణ పోలీసు స్టేషన్ ను ఎస్పీ బుధవారం తనిఖీ చేసి మాట్లాడారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. సీజ్ చేసిన వాహనాలను త్వరగా డిస్పోజ్ చేయాలన్నారు. పోలీసు స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఎవరైనా సమస్యల పట్ల పోలీసుస్టేషన్ ను ఆశ్రయించినప్పుడు మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. అలా కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతకుముందు స్టేషన్ లో రికార్డులను పరిశీలించి పోలీసులకు పలు సూచనలు చేశారు. ఎస్పీ వెంట కర్నూలు డీఎస్పీ జె. బాబు ప్రసాద్, కర్నూలు మూడో పట్టణ సీఐ శేషయ్య, ఎస్ఐ మన్మధ విజయ్ తదితరులు ఉన్నారు.