తెలుగు తమ్ముళ్లను బుజ్జగించిన బిజెపి ఎమ్మెల్యే. – పెద్ద తుంబలం గ్రామంలో సిసి రోడ్లు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే పార్థసారథి
కర్నూలు జిల్లా.. ఆదోని మండలం పరిధిలో పెద్ద తుంబలం గ్రామంలో సిసి రోడ్లు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే పార్థసారథి .ఈ సమావేశంలో మీడియాలో మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం నిధులు తీసుకొస్తాం గ్రామ అభివృద్ధి కోసం మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో అభివృద్ధి చేస్తాం. కూటమి పార్టీలో చిచ్చు రేపుతున్న వైసీపీ నాయకులకు కూటమి పార్టీలో ఎన్ని చిచ్చులు పెట్టిన పార్టీ చీలిపోదు. ఇది మీరు గుర్తుంచుకోవలసినది కూటమిలో పొత్తుల భాగంగా అలిగిన తెలుగు తమ్ముళ్లను బుజ్జగించిన ఎమ్మెల్యే పార్థసారథి ఇకనుంచి అన్ని మంచి రోజులే మనమందరం కలిసి ఉందాం కలిసి అభివృద్ధి చేద్దాం మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం సీనియర్ నాయకుడు అన్వర్ భాష మౌలా సాబ్ ,షేకఅహ్మద్ నాగరాజు,కాసిమయ్య నరసయ్య,జాహీర్, రామిరెడ్డి తెలుగుదేశం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.