నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామివారిని తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి IAS దర్శించుకుని పూజలు నిర్వహించారు ముందుగా స్వామివారి దర్శనార్ధం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి IAS కు ఆలయ ఈవో శ్రీనివాసరావు అర్చకులు వేదపండితులు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అనంతరం తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి IAS స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు అమ్మవారి ఆశీర్వచన మండపంలో ఆలయ అధికారులు స్వామిఅమ్మవారి జ్ఞాపికను అందజేయగా అర్చకస్వాములు వేదపండితులు శాస్త్రోక్తంగా ఆశీర్వచనలిచ్చి తీర్ధప్రసాదాలను అందించారు..