కర్నూలు : లంబాడి హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్. కైలాష్ నాయక్ గిరిజన భవన్ సందర్శించిన సందర్భంగా సందర్బంగా విలేకరులతో మాట్లాడుతూ .. రాష్ట ప్రభుత్వం గిరిజన ప్రజలకు వివాహాముల పంక్షన్ సుబాకార్యలకు మరియు ప్రభుత్వ కార్యక్రమం ల కోసం చాల సంవత్సరాలు గా గిరిజన సంగాల పోరాట పలితంగా గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 2023 సంవత్సరం లో కర్నూలు పట్టడానికి 5 కిలోమీటర్ దూరంగా ఉండడం మరియు కోటి 35 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి.కనిసం రహదారి కూడ సరిగ్గా లేకుండా గిరిజనం భవన్ కట్టించారన్నారు. అందులో కనీసం కూర్చోవడానికి కుర్చీలు ‘ వంట సామానులు’ సప్లయర్ సామాన్లు మరియు మంచినీటి సౌకర్యం కూడా సరిగా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఖాళీ స్థలంలో ఉన్న గుంతలు పూడ్చక పోవడం, గిరిజన ప్రజలకు భవనం ఎటువంటి ఉపయోగం పడటం లేదని వీటిని ప్రభుత్వం వెంటనే సమకూర్చలని. డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో రత్నవత్ శంకర్ నాయక్,కాట్రవత్ శంకర్ నాయక్ ఉన్నారు.