మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణం కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి – డా. కె.వేణుగోపాల్, సీఈఓ సెట్కూరు  

V POWER NEWS:  ఉమ్మడి జిల్లా యువజన సంక్షేమ శాఖ – సెట్కూరు ఆధ్వర్యంలో  ప్రభుత్వ జూనియర్ కళాశాల, బి.క్యాంపు, కర్నూలు  నందు మత్తుపదార్థాలు  వ్యసనం – పర్యవసానాలు, సైబర్ క్రైమ్ అనే అంశాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో సెట్కూరు సీఈఓ డా.కె.వేణుగోపాల్  మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్ప్రభావాల పై యువత, విద్యార్థులకు అవగాహన కలిగి ఉండాలని, మత్తు పదార్థాలకు అలవాటు పడితే విలువైన జీవితం కోల్పోవాల్సి వస్తుందన్నారు,  మన సమాజం ఎదుర్కొంటున్న కీలక సమస్యలలో మాదక ద్రవ్యాల వాడకం ఒకటని, పెరుగుతున్న ఆధునిక జీవన శైలి, ఒత్తిడితో చాలా మంది యువత డ్రగ్స్ వాడకానికి బానిసలవుతున్నారని తెలియ చేశారు. డ్రగ్స్ వినియోగం వల్ల యువత మరియు సమాజం మీద పడుతున్న దుష్పలితాలను వివరించారు. 

యువత  డ్రగ్స్ అమ్ముతున్న విషయం తమ దృష్టికి వస్తే వెంటనే సమాచారాన్ని పోలీసులకు  టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు సమాచారం ఇవ్వాలని,  డ్రగ్స్, మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండి,  ఆరోగ్యవంతమైన సమాజాన్ని, మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణం కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని  పిలుపునిచ్చారు. అదేవిధంగా  ప్రిన్సిపాల్ శ్రీమతి పి సరళా దేవి  మాట్లాడుతూ, యువత చదువుకునే వయసులో చదువు ఫై మాత్రమే మనసు లగ్నం చేయాలనీ,  విరామ సమయంలో  క్రీడలలో పాల్గొని ఆరోగ్యంగా ఉండాలని,  ఇంటి వద్ద కుటుంబ సభ్యులు, మిత్రుల తో సమయం గడపాలని, చడు స్నేహాలకు దూరంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెట్కూరు పర్యవేక్షకులు శ్యాంబాబు, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.
Share the content

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!