నగరంలోని బుధవారపేట లో ఎఫ్.పి.షాపులను తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ డా. బి. నవ్య


V POWER NEWS : కర్నూలు జిల్లాలో అక్టోబర్ నెల 15 వ తేదీ వరకు రేషన్ షాప్ డీలర్ల ద్వారా స్మార్ట్ రేషన్ కార్డులను పొందవచ్చని,16 వ తేదీ తర్వాత సచివాలయ ఉద్యోగుల ద్వారా స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా పంపిణీ చేయబడతాయని జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య తెలిపారు. బుధవారం నాడు నగరంలోని బుధవారపేట లో 1382073, 1382075 ఎఫ్.పి.షాపులను జాయింట్ కలెక్టర్ తనిఖీ చేసి రేషన్ పంపిణీ ని పరిశీలించారు. అనంతరం వినియోగదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఎఫ్.పి షాపుల ద్వారా వినియోగదారులకు రేషన్ సరుకులను సక్రమంగా పంపిణీ చేయాలని డీలర్లకు సూచించారు. స్మార్ట్ రేషన్ కార్డులను ఉచితంగా పంపిణీ చేయాలని, ఎవరైనా డీలర్లు డబ్బులు అడిగితే కఠిన చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ హెచ్చరించారు.