ప్రజల మౌలిక సదుపాయాలపై జీఎస్టీని తగ్గించి ఆర్థిక సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుంది కృషి చేస్తుంది … సెట్కూర్ సిఈఓ మరియు జిల్లా యువజన సంక్షేమ అధికారి డాక్టర్ కే వేణుగోపాల్

V POWER NEWS : కర్నూలు జిల్లాలో.. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సెట్కూర్ సిఈఓ మరియు జిల్లా యువజన సంక్షేమ అధికారి డాక్టర్ కే వేణుగోపాల్ ఆధ్వర్యం లో కల్లూరు మండలంలోని తడికనపల్లి గ్రామంలో పెన్షన్ పంపిణీ మరియు సూపర్ జిఎస్టి – సూపర్ సేవింగ్ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా ప్రజల యొక్క అవసరాల మేరకు ఔషధాలు, పాలు, నిత్య అవసరాలు, ఎల్ఐసి పాలసీలు మొదలైన వాటి మీద ప్రభుత్వం వారు జీఎస్టీని తగ్గించి ప్రజలు ఆర్థిక సంక్షేమానికి కృషి చేయడానికి ప్రయత్నం చేసిందని దయచేసి ఈ విషయంపై అందరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. తదుపరి గ్రామ ప్రజలందరితో కలిసి ర్యాలీ నిర్వహించటం జరిగినది. ఈ సమావేశం హాజరైనటువంటి డిసిపిఓ రామకృష్ణ ప్రభుత్వంలో జిఎస్టి స్లాబ్ రేట్స్ గురించి గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా మండల అభివృద్ధి అధికారి జిఎన్ఎస్ రెడ్డి మరియు ఉప మండల అభివృద్ధి అధికారి నగేష్, ఏపీఎం పుష్ప,సర్పంచ్ సహేరబి,పొదుపు సంఘ నాయకురాలు జుబేదాబీ ఇతర గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొనడం జరిగినది.
