సింహపురి సింహము కామ్రేడ్ తోట సుధాకర్ ప్రసాద్ చిత్రపటానికి పూల మాలలు వేసిన APRSA కర్నూలు డివిజన్ అధ్యక్షులు వి.రామాంజనేయులు & సెక్రటరీ వేణుగోపాల్ రావు, డివిజన్లోని తహసీల్దారులు

V POWER NEWS : కర్నూలు రెవెన్యూ డివిజన్ APRSA సభ్యులoదరూ కలిసి, రెవిన్యూ డివిజన్ కార్యలయము సమావేశ మందిరములో కర్నూలు డివిజన్ అధ్యక్షులు వి.రామాంజనేయులు & సెక్రటరీ వేణుగోపాల్ రావుల అధ్యక్షతన జరిగిన వర్ధంతి సభ జరిగింది.ఈ సభకు కర్నూలు డివిజన్ లోని రెవిన్యూ డివిజన్ సభ్యులు మరియు డివిజన్ లోని తహసీల్దారు లు హాజరై కామ్రేడ్ తోట సుధాకర్ ప్రసాద్ ఫోటో కు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సింహపురి సింహము అయిన కామ్రేడ్ తోట సుధాకర్ ప్రసాద్ సేవలను APRSA అధ్యక్షులు వి.రామాంజనేయులు కొనియాడారు.అలాగే APRSA ప్రతి సభ్యుడు అయన యొక్క స్ఫూర్తితో పోరాట పటిమతో యుండి ప్రతి యొక్క ఉద్యోగి కి సేవలను చేయాలనీ కొనియాడారు.అలాగే ఈ సందర్భంగా కల్లూరు తహసీల్దారు కే.ఆంజనేయులు,సి.బెళగల్ తహసీల్దారు శ్రీమతి వెంకటలక్ష్మి, కోడుమూరు తహసీల్దారు బి.నాగరాజు మరియు విశ్రాంత తహసీల్దారు మల్లికార్జున తదితర వక్తలు కామ్రేడ్ తోట సుధాకర్ ప్రసాద్ సేవలను ప్రసంగించారు.

ఈ కార్యక్రమములో APRSA కర్నూలు డివిజన్ అసోసియేషట్ అధ్యక్షులు సతీష్,APRSA కర్నూలు డివిజన్ ట్రెజరర్ R. విష్ణు ప్రసాద్, APRSA కర్నూలు డివిజన్ E.C., మెంబర్ వెంకట సునీల్ కుమార్, పౌర సరఫరా శాఖ డిప్యూటీ తహసీల్దారు మురళీకృష్ణ, వెల్దుర్తి డిప్యూటీ తహసీల్దారు సి.గురుస్వామి రెడ్డి, EDM. జయక్రిష్ణ, RDO కార్యాలయం జూనియర్ సహాయకులు సోయబ్ అస్లాం భాష తదితర రెవిన్యూ ఉద్యోగులు అందరూ పాల్గొనడము జరిగినది