V POWER NEWS : కర్నూలు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ మరియు సాధికారత అధికార విభాగం కింద పని చేయుచున్న వన్ స్టాప్ సెంటర్ – మిషన్ శక్తి ద్వారా అందిస్తున్న సేవలు తాత్కాలిక వసతి, వైద్య, న్యాయ, పోలీస్ మరియు కౌన్సిలింగ్ సేవలు ఉంటాయి. ఎపుడు వన్ స్టాప్ సెంటర్ ను ఆశ్రయించాలి అనేటువంటి పోస్టర్స్ ను.సోమవారం నాడు కలెక్టర్ సిరి అలాగే జాయింట్ కలెక్టర్ నవ్య చేతులమీద గా విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో ప్రాజెక్ట్ డైరెక్టర్ పి. విజయ, డిఆర్ఓ, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ విజయ లక్ష్మి, వన్ స్టాప్ సెంటర్ అడ్మిన్ పి. మేరీ స్వర్ణలత, జోష్టనా పాల్గొన్నారు.