గణనాథుడి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు. శనివారం కర్నూలు సమాచార శాఖ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ గణపతిని జిల్లా కలెక్టర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గణనాథుని ఆశీర్వాదంతో ప్రజలందరూ ఆరోగ్యంగా ,ఆనందంగా, సుఖశాంతులతో ఉండాలని కోరారు. అదే విధంగా జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా ముందుకు సాగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. అనంతరం పాత్రికేయ ఉత్సవ గణపతి సమితి సభ్యులు కలెక్టర్ గారికి సన్మానం చేశారు.

కర్నూలు జిల్లా కలెక్టర్ తో పాటు సమాచార పౌర సంబంధాల శాఖ ఉప సంచాలకులు కె.జయమ్మ, దేవకాంత్, వడ్డే మోహన్ పాత్రికేయ ఉత్సవ సమితి నాయకులు మంజునాథ్ యాదవ్, రామకృష్ణ, వెంకట సుబ్బయ్య, శ్రీనివాసులు, శ్రీనాథ్ రెడ్డి, అవినాష్ శెట్టి, హరి కృష్ణ, మల్లికార్జున, గంగాధర్, ఇస్మాయిల్, ఆసిఫ్, రాఘవేంద్ర, మధు, పరమేష్, తదితరులు పాల్గొన్నారు.