177/C సర్వే నెంబర్ పై .. తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలి .. ఆర్జీఎన్ హ్యూమన్ రైట్స్ & యాంటీ కరప్షన్ అసోసియేషన్ ఎపి ఇంచార్జి విజయ్ కుమార్
V POWER NEWS: కర్నూలు ఓర్వకల్ మండలం,బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన కానుగుల రాజారావుకు న్యాయం చేయాలనీ ఆర్జీఎన్ హ్యూమన్ aరైట్స్ & యాంటీ కరప్షన్ అసోసియేషన్ ఎపి ఇంచార్జి విజయ్ కుమార్ అధికారులను కోరారు. గురువారం ఆర్జీఎన్ హ్యూమన్ రైట్స్ & యాంటీ కరప్షన్ అసోసియేషన్ కర్నూలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎపి ఇంచార్జి విజయ్ కుమార్,ఆర్గనైజింగ్ సెక్రటరీ సత్యనారాయణ,జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్,ఉపాధ్యక్షులు పరమేష్ లతో కలిసి గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం,జాయింట్ కలెక్టర్ నవ్యను కలిసి బాధితుడు కానుగుల రాజారావుకు జరిగిన అన్యాయంపై న్యాయం చేయాలనీ కోరుతూ వినతిపత్రం అందచేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కర్నూలు జిల్లా, ఓర్వకల్ మండలం, బ్రాహ్మణపల్లి గ్రామంలోని 177/C సర్వే నెంబర్లులో ఐదు ఎకరాల భూమిని కానుగుల సత్యరాజు కుటుంబ సభ్యులు రెండు తరాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో వారసత్వంగా కానుగుల రాజారావు సైతం భూమిలో అనుభవంలో ఉన్నాడు. అయితే ఎపిఐఐసి వారు సర్వే రిపోర్ట్ లో మండల రెవెన్యూ, రెవెన్యూ డివిజన్ అధికారులు ఇచ్చిన తప్పుడు సమాచారం ద్వారా బాధితుడికి అన్యాయం జరిగిందని చెప్పారు. వారి రిపోర్ట్ ఆధారంగా ఎపిఐఐసి వారు ఎలాంటి విచారణ చేపట్టకుండానే బాధితుడు సాగు చేసుకుంటున్న భూమిని స్వాదినం చేసుకునేందుకు ప్రయత్నం జరుగుతుంది అని పేర్కొన్నారు. భూమిలోకి రైతు కానుగుల రాజారావును భూమి సాగుచేయకుండా భయాందోళనకు గురిచేయడం బాధాకరమని ఆవేదన చెందారు. బాధితుడు కానుగుల రాజారావు న్యాయం కోసం జిల్లా అధికారులు, డివిజన్ మండల రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగి అనేక దపాలుగా ఫిర్యాదు చేసిన అధికారులు స్పందించకపోవడం సరైందికాదన్నారు.కావున ఇప్పటికైనా బాధితుల సమస్యపై సమగ్ర విచారణ చేపట్టి, ప్రస్తుతం APIIC ZO కి బాధితులను మానవతా దృక్పధం తో 2014-2015 సంవత్సరం భూసర్వేలో జరిగిన అవకతవకలను గుర్తించి, బాధితుడికి తగిన నష్టపరిహారం అందించడంతోపాటు,బాధితుడిని ఎటువంటి ఇబ్బందులకు గురిచేయకుండా తగిన న్యాయం చేయాలనీ,లేనిపక్షంలో బాధితుడి తరుపున ఓర్వకల్ మండల రైతులను చైతన్యం చేసి ఆర్జియన్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోరాటం సాగిస్తామని వారు తెలిపారు.