హైదరాబాద్ నగరంలో 15-06-2025 వ తేదీన విశ్వజ్యోతి జ్యోతిష్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో జరిగిన 16వ వైదిక జ్యోతిష్య సదస్సులో, నాకు “జ్యోతిష్య జ్ఞాన రత్న” అనే గౌరవ బిరుదు ప్రదానం చేయడం నాకు గర్వకారణంగా ఉందని మరియు ఇంత గొప్ప గౌరవాన్ని అందించడానికి కారణమైన విశ్వజ్యోతి సంస్థకు, అలాగే మద్దతు ఇచ్చిన నా కుటుంబానికి, గురువులకు, మరియు నా జ్యోతిష్య విద్యార్థులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు.

రెండు దశాబ్దాలుగా నా జీవితం జ్యోతిష్య సేవకు అంకితం చేశానని, అనేక మందికి జాతక విశ్లేషణ, దోష పరిహారాలు, మరియు శాస్త్రాధారిత మార్గదర్శనాన్ని అందిస్తూ వచ్చామన్నారు. తదనంతరo ఈ నిస్వార్థ సేవను గుర్తించి, నాకు “జ్యోతిష్య జ్ఞాన రత్న పురస్కారం”ను అందజేయడం గర్వకారణoగా ఉందన్నారు. ఇది నా మార్గంలో మళ్లీ ఒక ప్రేరణగా నిలుస్తుందని, ఈ ప్రయాణంలో నా మీద విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం దైవజ్ఞ రత్న బహుగ్రంధ రచయిత పుచ్చ శ్రీనివాస రావు, జోతిష్య విశారద గ్రంథ రచయిత శ్రీ పాలపర్తి శ్రీకాంత శర్మ గారి చేతులమీదుగా పురస్కారం అందించడం జరిగింది.