తర్తూరు గ్రామంలో …. రమణీయంగా శ్రీలక్ష్మి రంగనాథ స్వామి రథోత్సవం.

V POWER NEWS  : నందికొట్కూరు నియోజకవర్గం జూపాడు బంగ్లా మండలం తర్తూరు గ్రామంలోని శ్రీ లక్ష్మీరంగనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం రమణీయంగా ఆలయ కమిటీ నిర్వహకులు, అర్చకులు ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వామివారికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకిలో ఊరేగించారు. అనంతరం రథంలో స్వామివారిని ఉంచి గోవింద నామ స్మరణంతో వేలాది మంది భక్తుల మధ్య ఊరేగించారు. రథోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే గిత్త జయసూర్య హాజరైయ్యారు. టీడీపీ నాయకులు, ఆలయ అధికారులు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికి, రథోత్సవం వద్దకు తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేసి స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. రథోత్సవం సందర్బంగా చేపట్టిన పలు పూజా కార్యక్రమాలలో నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య, టీడీపీ నంద్యాల పార్లమెంటు ఇన్‌చార్జి శివానందరెడ్డి , పాణ్యం టీడీపీ యువనాయకులు గౌరు జనార్ధన్ రెడ్డి, దేవాదాయ శాఖ అధికారి సాయి కుమార్ , తహసీల్దార్‌ శ్రీనివాసులు, ఎంపీడీవో గోపి కృష్ణ పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేసి స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నా ఎమ్మెల్యే స్వామి వారి తేరును భక్తులతో కలసి లాగారు. స్వామి వారి రథోత్సవ కార్యక్రమాన్ని తిలకించేందుకు ఉమ్మడి జిల్లా కర్నూలు నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. గత వైసీపీ ప్రభుత్వ ఇదేళ్ల పాలనలో తర్తూరు జాతర కళ తప్పిపోయిందని ఎమ్మెల్యే ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మళ్ళీ పల్లెల్లో పండగ జాతరలు అంగరంగ వైభావంగా ప్రజలు జారుకున్నరన్నారు.

రైతు జాతర తర్తూరు కు పూర్వవైభవం కూటమి ప్రభుత్వం తీసుకొస్తుందన్నారు. ఎలాంటి అవాంఛనియ సంఘటనలు చోటుచేకోకుండ ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్, ఆధ్వర్యంలో నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రథోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయమే వివిధ గ్రామాల నుంచి భక్తులు బక్షాలబండ్లు తో అధిక సంఖ్యలో వచ్చి స్వామివారికి నైవేద్యం సమర్పించారు. పంటలు వచ్చిన సమయంలో స్వామివారిపేరు మీద తీసిపెట్టిన ధాన్యంతో చేసిన భక్ష్యాలను నైవేద్యం సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని పెద్దలు చెపుతుంటారు . కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ తరిగోపుల మందడి నారాయణరెడ్డి, మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ ప్రసాద్ రెడ్డి, యాదవ్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ వెంకటేశ్వర్లు యాదవ్, మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి,మండల కన్వీనర్ గుండ్రెడ్డి మోహన్ రెడ్డి రమణారెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, హనుమంత రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, మాధవరం ప్రకాశం మాధవరం, తాటిపాడు నాగిరెడ్డి కమిటీ సభ్యులు ప్రభావతమ్మ, లక్ష్మీదేవి, వెంకటేశ్వర్లు, పరమేశయ్య, వెంకటసుబ్బమ్మ, సుబ్బన్న, టీడీపీ నాయకులు రమణారెడ్డి, రామోహ్మన్‌రెడ్డి, హనుమంతరెడ్డి, గుండం రమణారెడ్డి, మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

Share the content

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!