మహిళల అభ్యున్నతికి అనేక సంక్షేమ కార్యక్రమాలు. …పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు. … బ్యాంకు లింకేజీ కింద 6880 మహిళా సంఘాల సభ్యులకు 74.93 కోట్ల రూపాయలను పంపిణీ చేశాం. ….నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ మహిళలు అభ్యున్నతి చెందాలని, స్వయం శక్తితో ఎదగాలని, సాధికారత దిశగా అడుగులు వేయాలని, సమాజాన్ని ముందుండి నడిపించాలన్న ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపట్టి అమలు చేస్తున్నారన్నారు. 20వ శతాబ్ద ప్రధమార్ధంలో పురుషులతో సమానంగా మహిళలకు సమాన హక్కులు, వేతనాలు, ఓటు తదితర అంశాలపై ప్రపంచ పోరాటాల నేపథ్యంలోనే భాగంగా ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు.