V POWER NEWS : కర్నూల్ పట్టణంలో, స్త్రీ శిశు సంక్షేమ వారి ఆధ్వర్యంలో, రాష్ట్ర ప్రభుత్వం సాధికారత ఆదేశాల మేరకు, అంతర్జాతీయ మహిళా దిన వారోత్సవాల సందర్బంగా, మార్చ్ 1 నుండి 8 వరకు మహిళా హక్కులు ,మానవ హక్కులు, సమాన వేతనం, పనిలో గౌరవం, మహిళకు, బాలికలకు ,రక్షణలో భాగంగా, ప్రజలు ప్రజాస్వామ్యకవాదులు, కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు.

అందులో భాగంగా నర్సింగ్ కాలేజీ విద్యార్థులు, స్కూలు విద్యార్థులు, మెప్మా పొదుపు సంఘాల మహిళలు మరియు కలెక్టర్ కార్యాలయం నుండి మెడికల్ కాలేజ్ సర్కిల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో మహిళలు మరియు బాలికలందరికి హక్కులు, సమానత్వం, సాధికారత ఉండాలని సమాజానికి ప్లే కార్డు ద్వారా నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగి ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారిని పి. నిర్మల, ACDPO రేవతి జోష్ట్న, మహిళా పోలీస్ స్టేషన్ DSP శ్రీనివాస్ ఆచారి, DCPO శారదా, ఇండ్ల విజయలక్ష్మి ,వన్ స్టాప్ సెంటర్ అడ్మిన్ పి. మేరీ, స్వర్ణలత, మరియు ఫేవోర్డ్ నెట్వర్క్ ఏవి రమణయ్య ,కొమ్ము పాలెం శ్రీనివాస్ , మధు, శకుంతల, ఎలీషాబాబు పాల్గొన్నారు.