శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు …… తండోపతండాలుగా శివనామ స్మరణతో కైలాసద్వారం నుంచి శ్రీశైలానికి లక్షల సంఖ్యలో పాదయాత్ర ద్వారా శివ భక్తులు

నంద్యాల జిల్లా శ్రీశైలం అడవులు శివనామ స్మరణతో మారు మ్రోగుతున్నాయి శివస్వాములు సాధారణ భక్తుల అడుగులన్ని శ్రీశైలం కొండలవైపు పరుగెడుతున్నాయి. తండోపతండాలుగా మహాశివరాత్రి పర్వదినానికి తరలి వెళ్లాలని భక్తులు భక్తి శ్రద్ధలతో ఎండను సైతం లెక్క చేయకుండా వృద్దులు చిన్నపిల్లల సైతం పాదయాత్రతొ శివయ్య సన్నిధికి చేరుకుంటున్నారు అడుగులన్ని శ్రీశైలం వైపే నల్లమల అడవులు శివనామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి ఎండను సైతం లెక్కచేయకుండా కొండలు కోనాలు దాటుతూ భక్తులు తమ భక్తిని చాటుకుంటున్నారు వెంకటాపురం నుంచి నల్లమల అడవులలొ పాదయాత్రతొ ఆకలి దప్పికను సైతం లెక్క చేయకుండా వందల కిలోమీటర్లు నడక మార్గంలో అక్కడక్కడ చెట్ల వద్ద చేదతీరుతూ మెట్ల మార్గంలో శ్రీశైలం సమీపంలోని కైలాస ద్వారం వద్దకు చేరుకుని శివలింగానికి తల తాకించి కొరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారమైన శివయ్యకు మొక్కలు తీర్చుకుంటున్నారు. శ్రీశైం మల్లన్న భక్తులు కిలోమీటర్ల మేర కొండా కోనలు దాటుకుంటూ శ్రీశైలం సమీపంలోని కైలాసద్వారం వద్ద సేదతీరుతూ పాదయాత్ర కష్టాలన్ని శ్రీశైల మల్లన్నపై ఉంచి చేదతీరుతున్నారు పాదయాత్రతో వచ్చే భక్తులకు దేవస్థానంతోపాటు జిల్లా అధికారులు కైలాసద్వారం, హటకేశ్వరం వద్ద వసతులు ఏర్పాట్లు చేశారు.  దట్టమైన అటవీప్రాంతంలో నడక సాగించి బారీ సెడ్లలో కొంతసేపు భక్తులు సేదతీరుతూ శివయ్యకు మొక్కులు తీర్చుకుంటున్నారు పాదయాత్ర చేసి అలసట చెందిన భక్తులకు దేవస్థానం వైద్యం కోసం అటవీప్రాంతంలో సుమారు 10 చోట్ల వైద్యశిబిరాలు అలానే స్వచ్చంద సేవకులు కాళ్ల నొప్పులకు ఒల్లు నొప్పులకు కాళ్లు బొబ్బలకు మెడిసిన్ టాబ్లెట్లు ఆయిట్ మెంట్లు ఇచ్చి భక్తుల సేవలొ తరిస్తున్నారు పాదయాత్ర చేసి అలసిపోయి వచ్చిన భక్తులకు దేవస్థానం అధికారులు స్వచ్చంద సేవా కర్తలు భక్తుల కోసం ఉచ్చిత బోజనాలు ఏర్పాటు చేశారు ఆకలితో వచ్చిన భక్తులకు బోజనాలు ఏర్పాటు చేయడంతో మల్లన్న భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కాలి బాటలో వచ్చే భక్తుల కోసం శ్రీశైల దేవస్దానం అధికారులు మార్గమధ్యంలో మంచినీటి ట్యాంక్ లు కైలాసద్వారం వద్ద ఏర్పాటు చేశారు భక్తుల దాహార్తిని తీర్చేందుకు మంచినీటి ట్యాంకర్లు నిరంతరం 10 ట్యాంకర్స్ తో నిటి సరఫర చేస్తున్నారు.

శ్రీశైల మల్లన్న భక్తుల పాదయాత్ర నంద్యాల జిల్లా ఆత్మకూరు నుండి రోడ్డు మార్గం ద్వారా వెంకటాపురానికి చేరుకొని అక్కడినుండి అటవీ మార్గం ద్వారా కోసాయికట్ట వీరాంజనేయ స్వామి గుడి నాగులుటి వీరభద్ర స్వామి ఆలయం దామర్లకుంట పెద్ద చెరువు మఠం బావి ధూమును కొలను కైలాస ద్వారం మీదుగా సుమారు 40 కిలోమీటర్లు నల్లమల్ల అడవులను దాటుకుంటూ శ్రీశైలాన్ని పాదయాత్ర భక్తులు చేరుకుంటారు అయితే పాదయాత్ర భక్తులకు నాగులుటి వద్ద ఆహారము దామర్లకుంట,పెద్ద చెరువు వద్ద నీటి వసతి,ఆహార వసతి తిరిగి మఠంభావిది,భీమునికొలను,కైలాసద్వారం వద్ద నీటి వసతి అధికారులు ఏర్పాట్లు చేశారు. శ్రీశైల మల్లయ్య శంభో శంకర అంటూ శివనామ స్మరణతో కైలాసద్వారం నుంచి శ్రీశైలానికి లక్షల సంఖ్యలో శివ భక్తులు సాధారణ భక్తులు తండోపతండాలుగా రోడ్లపై పాదయాత్ర చేస్తూ శ్రీశైలం చేరుకుని శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు మహాశివరాత్రి ఘడియలు దగ్గర పడడంతో లక్షలాదిగా భక్తులు శ్రీశైలం చేరుకుని స్వామిఅమ్మవార్ల బ్రహ్మోత్సవాలలో పాల్గొని దర్శనం చేసుకుని కర్పూర నీరాజనాలర్పిస్తున్నారు.

Share the content

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!