నంద్యాల జిల్లాలో… రైతులను ఇబ్బంది పెడితే ఊరుకునేదిలేదు … నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి స్పష్టం.
ఆళ్లగడ్డ మండలం బత్తులూరు, బృందావనం, విజయనగరం గ్రామాల్లోని ఊట కాల్వ శిదిలావస్థకు చేరుకోవడంతో మా గ్రామాలకు కేసి కెనాల్ ద్వారా ఆయకట్టుకు సాగునీరు, తాగు నీరు అందడం లేదని, ఊట కాల్వ సమస్యకు పరిష్కారం చూపించాలని ఆయా గ్రామాల రైతులు నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి వినతి పత్రం ద్వారా శనివారం నంద్యాల ఎంపీ కార్యాలయంలో మొరపెట్టుకున్నారు. రైతుల సమస్యలు విన్న వెంటనే ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి స్పందించి కే సి కెనాల్ ఈ ఈ ప్రతాప్ తో ఫోన్ ద్వారా మాట్లాడుతూ బత్తులూరు, బృందావనం, విజయనగరం గ్రామాల ప్రజలను ఇబ్బందిపెట్టే, నష్టం కలిగించే ఊట కాల్వ సమస్యను వెంటనే పరిష్కరించాలని, 15 రోజుల్లో సమస్యకు పరిష్కారం చూపకుంటే తాను ఊట కాల్వ వద్దకు వెళ్లుతానని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కేసి కెనాల్ ఈ ఈ కి స్పష్టం చేశారు. రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని ఎంపీ ఆదేశించారు. ఎంపీ శబరికి వినతి పత్రం అందించిన బత్తులూరు గ్రామ పెద్దలు కె.చిన్న వెంకటసుబ్బారెడ్డి, పార్థసారథిరెడ్డి,ఇరిగెల మహేశ్వరరెడ్డి, తదితరులు ఉన్నారు.