ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ 477 సర్వేనెంబర్ నందు 2 ఎకరాల 77 సెంట్లు స్థలం కబ్జాకు గురైందని నన్ను ఒక వృద్ధ కుటుంబం ఆశ్రయించినారు. గత వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం సాయి ప్రసాద్ రెడ్డి పాలనలో ఇటువంటి దుర్మార్గుల గ్రూప్ అండదండలతో వీఆర్వో జయరాంరెడ్డి అవినీతిపరుడుగా అంచలంచలుగా ఎదిగినారని, అతని మీద విచారణ జరుపుతున్నారని తెలిసిందే అన్నారు. నేను సబ్ కలెక్టర్ కు మరియు సబ్ రిజిస్టర్ కు ఒక లేఖ రాస్తున్నామన్నారు. కబ్జాకు గురైన స్థలాలు కోర్టులో కేసు నడుస్తుండడం వలన కేసులు తెగేవరకు ఆ స్థలం పై ఏ రిజిస్ట్రేషన్లు జరపరాదని ఉత్తరం రాస్తున్నామన్నారు. ఆదోని చుట్టుపక్క ప్రాంతాల్లో ఇట్ల కబ్జాకు గురైన భూమి వివరాలను బాధితులు ఎవరైనా ఉంటే వారు సబ్ కలెక్టర్ కు ఒక లెటర్ రాసి వారికి అందించగలరని మీ వివరాలు రహస్యంగా ఉంచుతూ కబ్జా చేసిన వారిపై విచారణ జరిపించి తగు చర్యలు తీసుకుంటామన్నారు.
