పోలీసు లపై తిరగబడిన ముద్దాయులు అరెస్టు .. వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు శ్రీరామ్ 

కర్నూలు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు  విక్రాంత్ పాటిల్  ఆదేశాల మేరకు, ఆదోని  డి.ఎస్.పి యం. హేమలత  వారి సూచనల మేరకు ఆదోని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు  కే. శ్రీరామ్.   11.02.2025 వ తేదీన ఆదోని టౌన్ లోని మధు ఆసుపత్రి యజమాని అయిన  గుర్రెడ్డి  ఫిర్యాదు మేరకు, ఆదోని 1 టౌన్ పోలీసు స్టేషన్ నందు క్రైమ్ నెంబర్  18/2025 u/s 308(2), 351 (2) r/w 3 (5)  BNS మేరకు రఘునాద్ మరియు అడివేష్ అను ముద్దాయులపై కేసు నమోదు చేయడమైనది.  సదరు కేసులో ముద్దాయులు మధు ఆసుపత్రి లో  ఎన్టీఆర్ వైద్య సేవలు (ఆరోగ్యశ్రీ) పేరున చాలా అవకతవకలు జరుగుతున్నాయని కలెక్టర్ మరియు సబ్ కలెక్టర్ కి ఫిర్యాదు చేసి ఉన్నారు.  సదరు పిర్యాదులను వెనుకకి తీసుకోవడానికి ఫిర్యాదు దారుడు అయిన గుర్రెడ్డి ని ముద్దాయులు 50 లక్షల రూపాయలు డిమాండ్ చేసి ఉన్నారని ఫిర్యాదు దారుడి అభ్యర్థన మేరకు 39 లక్షలకు ఒప్పుకుని, 5 లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చే విదంగా ఒప్పందం  కుదుర్చుకోవడం జరిగింది.  అంతేకాకుండా బలవంతంగా 10 వేల రూపాయలను ఫోన్ పే కూడా చేయించుకున్నారు.  సదరు కేసులో ముద్దాయులకు నోటీసులు ఇవ్వడానికి 12.02.2025 వ తేదీన సాయంత్రము 17.15 గంటలకు బాల భాస్కర్ మరియు ముని చంద్ర కానిస్టేబుళ్లు వెళ్ళగా వారిపై తిరగబడి దాడికి పాల్పడి గాయపరచి పారిపోవడము  జరిగినది.  సదరు సంఘటనపై కానిస్టేబుళ్ల ఫిర్యాదు మేరకు Cr No.19/2025 u/s 121(1) r/w 3(5) BNS,ఆదోని  వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు శ్రీ రామ్ కేసు నమోదు చేయడo జరిగిందని, శనివారం నాడు  ఆదోని ఎస్డిపిఓ అయిన  ఎo. హేమలత వారి పర్యవేక్షణలో , వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు అయిన. శ్రీరామ్ , ఎస్ ఐ.రామస్వామి  మరియు సిబ్బంది ఆదోని టౌన్ లోని కొత్త బ్రిడ్జి వద్ద సదరు ముద్దాయులను అరెస్టు చేసి రిమాండుకు పంపడము జరిగిందని అలాగే  ప్రస్తుత పంచాయతీ రాజ్ డెపార్టుమెంట్ కు చెందిన డిప్యూటీ ఇంజనీర్  (DE) ని కూడా డబ్బులు డిమాండ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని సమాచారమ ఉందని  కమ్మి ఏనుగుల రఘునాథ్, కమ్మి అడివేష్ @ ఏనుగుల అడివేష్, అను వీరిపై  గతంలో వీరిపై ఇస్వి పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు కాబడినది అని  వన్టౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు శ్రీరామ్  మీడియా సమావేశంలో తెలిపారు. 
Share the content

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!