పెద్ద తుంబలం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది 21ఏళ్ల వివాహిత అనూష ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అనూష తన భర్త శాంతరాజును ప్రేమించి పెళ్లి చేసుకుంది వీరికి ఇద్దరు పిల్లలు రెండేళ్ల అమ్మాయి 9 నెలల బాబు ఉన్నారు. అనూష తండ్రి నక్కల హనుమంతు, తల్లి నక్కల బుజ్జమ్మ. ఆమె కుటుంబంలో నలుగురు సంతానం ఉండగా అనూష రెండవ పాప. భర్త కుటుంబంలో మామ తిక్కయ్య అత్త లలితమ్మ ఉన్నారు. ఈ ఘటనపై అనూష కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. అనూష ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆమె కుటుంబం ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటుందా? గృహ కలహాలా? లేక మరేదైనా కారణమా? అaనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. అనూష మృతితో కుటుంబ సభ్యులు బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.