తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి సంపద సృష్టిపై అవగాహన కల్పించండి …
*******

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో తాగునీరు, పారి శుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి సంపద సృష్టించే అంశాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు. ఇంటింటి నుండి సేకరించిన తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడంతో పాటు తడి చెత్తతో వర్మీ కంపోస్టు, పొడి చెత్తతో పేపర్ ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేసే సంపద తయారీ కేంద్రాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలోని సమగ్ర రక్షిత మంచినీటి పథకాలలో నిర్వహణ లోపం లేకుండా క్లోరినేషన్ చేసిన నీటినే సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పైప్ లైన్లలో మరమ్మత్తులు, ఇతర రిపేర్లు ఏమైనా ఉంటే 15వ ఆర్థిక సంఘం నిధులను వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రతి మండలం లోని ఒక గ్రామాన్ని ఎంపిక చేసి కిచెన్ గార్డ్ ప్రమోట్ చేసేందుకు గుర్తించాలన్నారు. అగ్రికల్చర్, హార్టికల్చర్ ఏపీసిఎన్ఎఫ్ ల భాగస్వామ్యంతో కిచెన్ గార్డ్ ల పెంపకం ముమ్మరంగా చేపట్టాలన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈనెల 15వ తేదీ మూడవ శనివారం ప్రతి కార్యాలయం, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ స్థలాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. స్వచ్ఛగ్రీన్ లీఫ్ రేటింగ్ కు సంబంధించి పర్యాటక ప్రదేశాలు, హోటల్స్ అసోసియేషన్ లతో సమావేశాలు నిర్వహించి డాక్యుమెంట్ తయారు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సమాధి అధికారులను కలెక్టర్ ఆదేశించారు.